యమ ఫేక్‌తుండ్రు

By | July 17, 2012 2 comments


‘‘హౌ ఆర్ యు మై బోయ్? నేను, మీ అమ్మ బావున్నాం. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. వెంటనే చూడాలనిపిస్తోంది. సో.. నీ పీసీ ఆఫ్ చేసి కిందికి వచ్చేసెయ్. కలిసి భోజనం చేద్దాం...’ ఒక తండ్రి తన కొడుకు ఫేస్‌బుక్ వాల్‌పై ఇలా పోస్ట్ చేశాడు. 


ఒకతనికి ఉరిశిక్ష పడింది. ‘నీ చివరి కోరిక ఏంటి?’ అని అడిగాడు జడ్జి. ‘నన్ను ఉరితీస్తున్నట్లు నా ఫేస్‌బుక్ స్టేటస్‌ని అప్‌డేట్ చేయాలి’ సమాధానమిచ్చాడతడు. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఆంబుపూన్స్‌లో ఆస్పవూతికి తీసుకొచ్చారు. కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పాడు డాక్టర్. ‘మీ వాళ్లకి ఏమైనా చెప్పాలా? అడిగింది నర్స్. ‘ఒకవేళ నేను చనిపోతే నా మొహంపైన వెంటనే గుడ్డ కప్పేయండి. లేదంటే మా ఫ్రెండ్స్ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతారు’ సమాధానమిచ్చాడు అబ్బాయి. 


నిజమే... ఇవి జోకులే కావొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషులు ఇలాగే తయారయ్యారని అనిపిస్తోంది.రెండు రోజుల క్రితం అసోం రాజధాని నగరంలో 20 మంది యువకులు ఒక అమ్మాయిపై దాడి చేశారు. దాన్ని ఒక ఛానెల్‌వాళ్లు వీడియో తీశారు. ఇంకొకరు యూట్యూబ్‌లో పెట్టారు. అందులో ఒక యువకుడు తెల్లటి చారలున్న ఎర్ర టీషర్టు వేసుకుని ఉన్నాడు. బాలికపై అఘాయిత్యం చేసిన వారిలో అతడే ప్రధాన నిందితుడు. సంఘటన జరిగిన రోజు వేసుకున్న టీషర్టుతో దిగిన ఫోటోతోనే అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఉంది. అతని పేరు అమర్ జ్యోతి కలితా. ఫేస్‌బుక్‌లో జేమ్స్‌బాండ్‌గా ఫోజు కొడుతుంటాడు. అసోం ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ‘ఆమ్‌వూటాన్’లో పనిచేస్తున్నాడు. 

avva‘ఆమ్‌వూటాన్’ ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ చేస్తే...‘ఈ ఇడియట్ మీ కంపెనీలో పనిచేస్తున్నాడా? అతన్ని వెంటనే తీసేయండి’‘ఐటీ సెక్టార్‌లో వాడు పనిచేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి’‘వీడికి అక్కాచెప్లూల్లు లేరా? అలా బిహేవ్ చేశాడు’.. ‘ఈ దుర్మార్గుడ్ని ఊరితీయించండి’ అని వేలమంది కామెంట్స్ రాస్తున్నారు. ఫేస్‌బుక్ ఒక సెన్సేషన్. నిజమే. ఈజిప్టులో రెవల్యూషన్‌ని నడిపించింది. మనదేశంలోనూ అన్నా హజారేకు అనుకోని విధంగా ఆన్‌లైన్‌లో మద్దతు లభించింది. దీనికో పద్ధతుంది. కానీ ఇప్పుడు పరిణామాలు మారుతున్నాయి. ఫలితాలు ఇంకోలా ఉంటున్నాయి. ఫేస్‌బుక్ ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల కొత్తగా 4,50,000 ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. దురదృష్టం ఏంటంటే ఫేస్‌బుక్‌లో అనవసరమైన ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల సుమారు 5 లక్షల 50 వేల మంది ఉద్యోగం పోగొట్టుకున్నట్లు ఒక సర్వే చెబుతోంది. అంతలా అడిక్ట్ అయిపోతున్నారు వినియోగదారులు. మనదేశంలోనే కాదు.. ఏ దేశంలోనూ ‘వ్యసనాల’ను చట్టాలు అంగీకరించవు. కానీ ఫేస్‌బుక్ వ్యసనాన్ని ఏ చట్టాలు అడ్డుకోలేకపోతున్నాయి. సో.. అది వేస్ట్‌బుక్ అవుతోంది. అందుకే ఇలాంటి జోకులు పుట్టుకొస్తున్నాయి. ‘నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావ్?’ అడిగింది టీచర్. ‘నేను ఫేస్‌బుకింగ్ చేస్తాను’ చెప్పాడు స్టూడెంట్. ‘నా ఉద్దేశం నువ్వు ఏమవుతావని?’‘నేను నా ఫేస్‌బుక్ పేజీకి అడ్మినిస్ట్రేటర్ అవుతాను టీచర్’‘ఇడియట్! నేను అడిగేది మీ తల్లిదంవూడుల కోసం ఏం చేస్తావని?’‘వాళ్ల కోసం కూడా మామ్ అండ్ డాడ్ అని ఒక ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేస్తాను’‘యూ స్టుపిడ్! మీ పేరెంట్స్ నీ నుంచి ఏం కోరుకుంటారని అడుగుతున్నాను?’‘ఓ అదా.. నా ఫేస్‌బుక్ పాస్‌వర్డ్!’‘అరే వెధవ.. జీవితంలో నీ పర్పస్ ఏంటని అడుగుతున్నాను’ గట్టిగా అరిచింది టీచర్. 

pisacham‘Facebook but never face your books.. ఇదే టీచర్ నా పర్పస్’ చెప్పాడు విద్యార్థి.పిల్లలు కూడా ఫేస్‌బుక్‌ని మితిమీరి వాడుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఫేస్‌బుక్ వాడకం మొదట్లో సరదాగానే ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరికి వేలల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప. అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తాయి. ఒక అబ్బాయి నేను ఇంటర్‌లో డిస్ట్రిక్ ఫస్ట్ వచ్చానని స్టేటస్ అప్‌డేట్ చేశాడు. అతనికి మూడు లైక్‌లు, రెండు కామెంట్లు వచ్చాయి. ఒక అమ్మాయి.. ‘నేను బాగా అలిసిపోయాను.. మార్నింగ్ నుంచి ఈవెనింగ్ దాకా బిజీ బిజీ’ అని పోస్ట్ చేసింది. ఆమె ‘స్టేటస్’కి వందల్లో కామెంట్లు.. వెయ్యికి దగ్గరగా లైక్‌లు... ఇప్పుడలా తయారైంది ఫేస్‌బుక్. కామెంట్లు, లైక్‌లు ఎక్కువగా రావాలంటే మీరు చేసే పోస్ట్ ‘వెరైటీ’గా ఉండాలి. ఆ వెరైటీ కోసం ‘బాలయ్య’ని వాడుకుంటున్నారు. ‘బ్రహ్మానందం’ని ఆటపట్టిస్తున్నారు. సోనియా మీద సెటైర్లు వేస్తున్నారు. రోశయ్య మీదా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒక్కర్ని ఇద్దర్నీ.. అని కాదు.. కనిమొళి నుంచి కత్రినా కైఫ్ దాకా.. జగన్ నుంచి పవన్ దాకా.. అందర్నీ వాడుకుంటున్నారు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నమాట. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి సరదాగా ఉండేవి. రెండు శృతిమించినవి. మొదటి దాంతో ప్రాబ్లమ్ లేదు. కానీ రెండో దాంతో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయి. రెండు..ఈ ధోరణి మరింత పెరుగుతుంది. 

యూట్యూబ్ అంటే ట్యూబ్‌లు టైర్లు అమ్మే దుకాణం అని అనుకునేవాళ్లు కొందరుండొచ్చేమో. కానీ యూట్యూబ్‌లో రోజంతా వీడియోల్నే చూస్తూ కూర్చునేవారు అంతకంటే ఎక్కువే ఉంటారు. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. నాలెడ్జ్ పెంచుకునేందుకు యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని ఆ మార్గంలో ఉపయోగించేవారితో పాటు నెగెటివ్‌గా ఉపయోగించేవాళ్లూ ఉన్నారు. ఐదేళ్ల క్రితం యూట్యూబ్ వాడకం తక్కువగానే ఉండేది. కానీ అప్పట్లోనే ఢిల్లీలో ఒక టీనేజ్ కుర్రాడు తన గర్ల్‌వూఫెండ్‌తో చేసిన రొమాన్స్‌ని రహస్యంగా సెల్‌ఫోన్ కెమెరాతో చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ తర్వాత అలాంటివి అప్పుడప్పుడూ సెన్సేషన్ సృష్టిస్తూనే ఉన్నాయి. ఇంటర్‌నెట్ కేఫ్‌లలో సీన్లు, బట్టల దుకాణాల్లో అమ్మాయిలు దుస్తులు మార్చుకునే వీడియోలు చాలానే అప్‌లోడ్ అయ్యాయి. అంటే ప్రయివేటు లైఫ్‌కు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. మెల్ల మెల్లగా యూట్యూబ్ కొన్ని వీడియోల్ని సెన్సార్ చేసింది. కానీ ఇది జరగాల్సిందంతా జరిగి పోయాకే జరిగింది. 

manఅసోంలో జరిగిన సంఘటన ఇలాంటిదే. 20 మంది నడిరోడ్డు మీద ఒక అమ్మాయిపై దాడిచేస్తుంటే నిలబడి చూసిన వాళ్లున్నారు. సెల్‌ఫోన్లతో వీడియో తీసినవారున్నారు. వెంటనే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసినవాళ్లున్నారు. ఇంటర్‌నెట్‌లోనే కనిపించే ఒక కార్టూన్ గుర్తొస్తోంది... ఒకడు నీళ్లలో పడి మునిగిపోతుంటాడు.. ఒడ్డున ఉన్న వాళ్లు సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తుంటారు కానీ.. ఎవరూ కాపాడే ప్రయత్నం చేయరు. ఇంకో జోక్.. ఒకతను చనిపోయాడు.. అతని దహన సంస్కారాలకు ‘వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో యు’ అంటూ ఒక హచ్ కుక్క మాత్రమే వస్తుంది.. అతనికి ఫేస్‌బుక్‌లో ఐదువేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. కానీ ఎవరూ రారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌లలో ముఖాముఖి కలుసుకున్నవాళ్లు ఎంతమంది ఉంటారు? అమ్మానాన్నలకు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను పంపిస్తోంది ఈ తరం. మానవసంబంధాలు ఫేస్‌బుక్ వల్ల మారిపోతున్నాయి. విర్చువల్ రిలేషన్‌షిప్స్ మాత్రమే మిగిలిపోయేలా ఉన్నాయి. కాలయంవూతంలో వెనక్కి వెళ్లండి డైనోసార్లని చూడండి.. అదే యంత్రంలో ముందుకు వెళ్లండి మానవసంబంధాలు, మానవత్వపు ఆనవాళ్లు ఇంకా మిగిలి ఉన్నాయో లేదో మీరే కళ్లారా చూడొచ్చు అంటారు ‘ది టైమ్ మిషిన్’ పుస్తకాన్ని రాసిన హెచ్ జి వెల్స్. నిజమే.. బైక్ సైడ్ స్టాండ్ తీయకుండా ఒక పావు కిలోమీటరు వెళ్లండి.. ‘సైడ్ స్టాండ్’ అని పది మంది చెప్తారు.. అదే రోడ్డు మీద ఒకడ్ని పట్టుకుని కొడుతుంటే చూస్తూ నిలబడేవాళ్లే ఎక్కువ.. అడిగేవాళ్లు కొందరే. అందుకే మనుషులు నాలుగు రకాలు.. మంచి వాళ్లు.. చెడ్డవాళ్లు.. పట్టించుకోనివాళ్లు.. ఇంటర్‌నెట్‌లోకి అప్‌లోడ్ చేసేవాళ్లు.

2 comments:

Manohar said...

Good one. thought provoking

సుధామ said...

చాలా బావుంది నగేష్ జీ!