Skip to main content

Posts

మనసంతా మ...మ్మ.. మాస్‌

జూబ్లీహిల్స్‌ స్కార్లెట్‌ క్లబ్‌... సర్రున ఓ కారు వచ్చి ఆగింది... నలుగురు స్త్రీలు... తలకు పాగాలు.. నుదుట నల్లని తిలకం.. చేతిలో తుపాకులతో అందులోంచి దిగారు... అక్కడి వారంతా వారిని చూసి బందిపోటు దొంగలనుకుని భయపడ్డారు. ఆ హోటల్‌ వారు కూడా కంగారు పడ్డారు. అంతలోనే తేరుకుని ఆరాతీస్తే... ఓ పార్టీకి సరదాగా ఆ గెటప్‌లో వచ్చారని తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. 'మామా... కల్లు మామా..' పాట చూశారుగా మాఫిమా గ్యాంగ్‌ పార్టీ ఎలా ఉంటుందో. మాఫియా డాన్లంటే మగాళ్లేనా మహిళలమూ ఏ మాత్రం తీసిపోమని సరదాగా ఆ గెటప్‌లో వచ్చారు వారు. చూశారా? వీరి మనసెంత మ... మ్మ... మాసో. మనసు అచెంచలమైనది. మనదే అయినా అది మనకు చిక్కదు, దొరకదు. కొత్తవి కోరుకోవడం దానికి కొత్తేం కాదు. మోనాటనీ అంటే దానికి మొహం మొత్తుతుంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టు నీడకై పరుగెత్తి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. ఇది ఒకప్పుడు. కాని ఇప్పుడు వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ వెధవైనా తింటాడు ఐస్‌క్రీమ్‌ తినేవాడే రొమాంటిక్‌ ఫెలో అంటారు ఈ తరం వారు. ఔను అర్థరాత్రి అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆన్‌ ది వ...

వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ

నేను చాలా తక్కువగా మాట్లాడతానని చాలామంది అంటుంటారు. గొప్ప వాళ్లు ఇలాగే ఉంటారని నాకు నేను సర్తి చెప్పుకునేవాన్ని. అసలు నిజం చెప్పాలంటే నాకు నేనలా ఉండడం నచ్చదు. మానవుడు సంఘజీవి. నలుగురిలో తిరుగుతూ నలుగురు స్నేహితులని వెనుక వేసుకుంటేనే బొద్దిగా లోకజ్ఞానం పెరిగినట్లు అని అర్థమైంది. కాని ఎదుటి వారు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. అందుకే "వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ''.. సినిమాలో హ.. హ... హసినీ క్యారెక్టర్‌ డిసైడ్‌ చేసేందుకు ఇలా అడుగుతుంది. నిజమే కదా! ఒకరి గురించి తెలుసుకోవాలంటే నాలుగు మాటలు మాట్లాడాల్సిందే మరి. అందుకే ఇలా మొదలెట్టా. 'విభూషణం మౌనం అపండితానాం' అన్నారు పెద్దలు. పాండిత్యం లేని వారు మౌనంగా ఉంటేనే బావుంటుందని దీనర్థం. ఇప్పుడిది అవుటాఫ్‌ డైలాగ్‌. ఎందుకంటే పండితులైనా పామరులైనా ఇప్పుడు గల గలా మాట్లాడాల్సిందే. అలా మాట్లాడగలిగితేనే సమాజంలో నలుగురితో పరిచయాలు. నలుగురిలో గుర్తింపు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ, మాట్లాడితే మాత్రం నలుగురు స్నేహితులు తప్పక దొరుకుతారు. వసపిట్టలా... కాలం మారింది. కళ్లతో భావాలు పలికించే వారికి కాలం చెల్లింది. నలుగురి...

ధైర్యమే ఆమె ఆస్తి

తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి... పుట్టాక ఆమె ఏడుపు ఆపేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఓ చేదు నిజం... ఆ తర్వాత మాట లూ రావని తెలిశాక వారి మనసులో మరో గరళం. కన్నవారి ఆదరణే కరువైతే... చుట్టూ ఉన్నవారి అభిమానం తనదౌతుందా? అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. కన్నీటి కడలిలో ఈదింది. చివరికి దరికి చేరింది. మౌనమే ఆమె భాష... ధైర్యమే ఆమె ఆస్తి... ఆమే హెలెన్‌ కెల్లర్‌ - 2007 అవార్డును అందుకున్న జానకి. జానకి డెఫ్‌ అండ్‌ డంబే కాదు రఫ్‌ అండ్‌ టఫ్‌ కూడా. తాను అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. మాటలు రాకపోతే నేం. మౌనమే ఆమె భాష. ఆమె కన్నులు కూడా మాట్లాడతాయి. ఆ భావాలు అర్థం కాని వారి ముందు ఆమె చేతి వేళ్లు సెల్‌ఫోన్‌పై చకచకా కదిలి సమాధానాలు చెబుతాయి. వినిపించకపోతేనేం ఎదుటి వాళ్ల మనోభావాలను ఇట్టే పట్టేస్తుంది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అవి తనలాంటి వారెవరికీ ఎదురుకాకూడదనుకుంది. అందుకే బధిరుల కోసం సంస్థకు స్థాపించి వారికి సేవ చేస్తోంది. జానకిది మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట. పుట్టి, పెరిగింది మాత్రం మహారాష్ట్ర పూనేలో. చదువు కూడా అక్కడే. ఇంటర్‌ వరకు చదువుకుంది. తల్లిద...

నా వరకు వచ్చేసరికి ఎందుకిలా?

నన్ను ప్రేమించేవారు, ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. నా కోసం ఏమైనా చేయగలిగిన వారు కూడా ఉన్నారు. కానీ వారంతా ఇప్పుడు నా కోసం ఏమీ చేయలేకపోతున్నారు. నేనిప్పుడు పిచ్చిదానిలా చదువుతున్నాను. ఇంతకముందు కూడా నాకు వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేదాన్ని. ఇప్పుడంతా నాకు వీలే. వారానికి ఒక పుస్తకం చదవడం పూర్తి చేస్తున్నాను. జీవితంలో లోతుపాతులను తెలుసుకోవాలంటే నాకు ఎప్పుడూ ఆసక్తే. ఇప్పుడు నేను విలాసంగా, ఆనందంగానే ఉన్నాను. కానీ ఏదో తెలియని బాధ. నిజం చెప్పాలంటే క్యాన్సర్‌ నా హృదయాన్ని తొలచివేస్తోంది. నాకు ఎనిమిది కంటే ఎక్కువ కెమో చికిత్సలు చేయాలి. 35 రకాల రేడియేషన్‌ సెషన్లు. 2010 జనవరి వరకు ఇలాగే ట్రీట్‌మెంట్‌. అదొక ప్లాన్‌. నేనూ చేయగలను. కానీ ఎందుకు చేయాలి? నా పాత జీవితం నాకు తిరిగి కావాలి. భవిష్యత్తును తలచుకొని, గతాన్ని గుర్తుచేసుకుని నరకం అనుభవిస్తున్నాను. ఇది వసంతం. ఒక మొక్కని కూడా నాటలేని స్థితిలో నేను ఉన్నాను. గతంలో ఎన్ని మొక్కలు నాటేదాన్ని. గతంలో ఎందరో పేషెంట్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చాను. ధైర్యం చెప్పాను. నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా? దేవుడి దయ వల్ల నాకు నయం అయ్యి, మళ్లీ మంచి రోజులు వస్తే....

జీవితమంటే పరీక్షలు ఫలితాలేనా? (మా కోడలి ఉత్తరం )

హాయ్‌ మామయ్య, ఎలా ఉన్నారు. నేను మాత్రం యావరేజ్‌ అండ్‌ యాంగ్రీ. ఎందుకా? మొన్న వచ్చినప్పుడు డాడీతో నా కాలేజ్‌ గురించి మాట్లాడమని చెప్పాను. మీరేయో బిజినెస్‌ అంటూ బిజిబిజీగా వెళ్లిపోయారు. నాన్న నా బ్రెయిన్‌ ఇక్కడ ప్రై చేసుకుని తినేస్తున్నాడు. మామయ్యా! జీవితమంటే పరీక్షలు, ఫలితాలేనా? అనిపిస్తోంది. మొన్నటి దాకా ఇంటర్‌ పరీక్షలు. ఆ తర్వాత మోడల్‌ ఎంసెట్‌, ఎంసెట్‌. ఆ వెంటనే ఎఐ త్రిపుల్‌ ఇ. పరీక్షలు అయిపోయాక రోజుకో రిజల్ట్‌. కాలేజ్‌ అయిపోయింది కదా అనుకుంటే అమ్మానాన్నలతో రోజూ ఇంట్లో ప్రయివేట్‌ క్లాస్‌ తప్పటం లేదు మామయ్య. నేను అన్నం తినడం మానేసి రోజూ డాడీతో తిట్లు తింటున్నాను. డాడీ ఆయన కలలన్నీ నా మీద రుద్దుతున్నారు. ఆయన జీవితంలో సాధించలేనివన్నీ నేను సాధించాలట. ఇంజినీర్‌ని కావాలట. లేకుంటే ఆర్యభట్టులా జీరో లాంటిది ఏదైనా కనిపెట్టాలట. ఆయన చెప్పింది చేస్తే నేనే పెద్ద జీరోలా మిగిలిపోయేలా ఉన్నా. నాకూ ఓ చిన్న మనసు ఉందని దానికీ చిన్నిచిన్నికోరికలు ఉన్నాయని డాడీకి ఎందుకు తెలియడం లేదు మామయ్య. అమ్మ అయినా అర్థం చేసుకుంటుందెమో అనుకున్నా, కానీ ఆమె ఓటు కూడా డాడీకే. నాకేమో కామ్‌గా బికామ్‌ చేయాలని ఉంది. డాడీ ఎమో ఎంసె...

చేయూతనందిస్తే చేజారదు జీవితం

కళ్ల నిండా నీళ్లు కమ్ముకు పోయి, మనసు నిండా దిగులు నిండుతూ పోయే సందర్భాలు ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో. ఓటమో, ఆశాభంగమో, అవమానమో మనసును తీవ్రంగా గాయపరిస్తే ఒంటరిగా మగ్గే క్షణాలు ఏదో సందర్భంలో అందరికీ అనుభవం లోకొచ్చేవే. ఆ సమయంలో తమను తాము ఓదార్చుకునే ఆత్మస్థైర్యం అందరికీ ఉండకపోవొచ్చు. ఓదార్చే తోడూ దొరక్కపోవచ్చు. ఆ బలహీన క్షణంలో మదిలో మెదిలే ఒకే ఒక్క ఆలోచన... 'ఆత్మహత్య'. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. ఆత్మహత్యకు పాల్పడే వారు కూడా తమ చావుకు అన్ని కారణాలు చెబుతుంటారు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది. అదే భవిష్యత్తు. ఇది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు గ్రహించరు కాబోలు. కాలం గడిచి... మనకూ మంచి రోజులు వచ్చాక ఆ పాత అనుభవాన్ని గుర్తుచేసుకుంటే. ఆ ఆలోచన ఎంతటి తప్పో తెలుస్తుంది. మరి తమకు తాము అంతటి సమయం కూడా ఇచ్చుకోకుండా క్షణికావేశంలో ఆత్మహత్మకు పాల్పడే వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని ముందే గుర్తించి చేయూతనందిస్తే వారి జీవితం చేజారదు.  మారుతున్న పరిస్థితులతో పాటు మానవతా విలువల్లో, జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  యువత అన్ని రంగాల్లో ఎంత వేగంగ...

గది నేర్పిన పాఠం

మనసు పెట్టి చూస్తే మట్టిలో సైతం అందాలు కనిపిస్తాయి. అది చూసే కనులని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ప్రతి వస్తువు నుంచి, ప్రతి ప్రాణి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. నా గది నాకు నేర్పిన కొన్ని పాఠాలు.   రూఫ్‌ ః మీ ల క్ష్యం ఎప్పుడూ గొప్పగా తన అంత ఎత్తులో ఉండాలని చెప్పింది.  ఫ్యాన్‌ ః ఎప్పుడూ ప్రశాంతంగా ఉండమని చెప్పింది.   గడియారం ః ప్రతి నిమిషమూ విలువైనదే అని ప్రతి సెకనూ టక్‌ టక్‌మని చెబుతూనే ఉంది.  అద్దం ః ఏదైనా చేయబోయే ముందు ఓసారి పరీక్షించుకోండి. లేదంటే తెలుసుకోండి. కిటికీ ః ప్రపంచాన్ని చూడమంటోంది.  క్యాలెండర్‌ ః అప్‌ టు డేట్‌ ఉండమంది.  డోర్‌ ః మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు బాగా కష్టపడితే ఇలాంటి ద్వారాలు ఎప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయట.