వీలైతే ఒకసారి... ఇది చదవడానికి ప్రయత్నించండి.

By | August 13, 2012 2 comments

My hols wr cmpltd. B4, we used 2 go 2 HYD 2c my sis, her hus & thr kids FTF. ILHYD, its a gr plc.
చదవడానికి కష్టపడింది చాలు. ‘నా సెలవులు పూర్తయ్యాయి. అంతకంటే ముందు మా సోదరి, ఆమె భర్త, పిల్లల్ని చూడడానికి హైదరాబాద్ వెళ్లాం. ఐ లవ్ హైదరాబాద్. ఇట్స్ ఏ గ్రేట్ ప్లేస్... (My holidays were a completed. Before, we used to go to Hyderabad to see my sister, her husband and kids face to face. I love hyderabad. It is a great place) ఇదీ దాని అసలు అర్థం.
రాను రానూ తరిగిపోతున్న మెసేజ్‌లు.
OMG! (ఓఎమ్‌జీ అంటే ఓ మై గాడ్ అని)
ఇంగ్లీషు మారిపోతోంది.
ఇది చూడండి. ఫైన్.. f9 అయింది. టుమారో 2marwగా మారింది. ఆంగ్లంలో ఇలాంటి పదాలు ఇప్పుడు షార్ట్ అయిపోయాయి.
పదాల్లో అక్షరాలకు అంకెలు కలిసి కొత్త లిపి తయారయింది. అలా మార్చిన క్రెడిట్ అంతా FB Gen (ఫేస్‌బుక్ జనరేషన్)దే అని చెప్పాలి.
యూ (you) అంటే ఇప్పుడు ఒకే అక్షరం (U). స్పెల్లింగ్ మర్చిపోయిన ఈ-తరం ‘ఎక్కడున్నావ్?’ అనడానికి.. wr r u? అని షార్ట్ అండ్ స్వీట్‌గా ఎస్‌ఎమ్‌ఎస్ చేసేస్తోంది. అదీ విషయం!
అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? పదాలను పొట్టిగా ఎందుకు మార్చేశారు? ఇట్లాంటి ప్రశ్నలకు జవాబుగా రాస్తున్న విశ్లేషణా వ్యాసం కాదిది. కానీ లిపి మారిపోతున్న సంగతిని షార్ప్‌గా గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం.
సెల్‌ఫోన్లు వచ్చాక ఎస్సెమ్మెస్స్ (షార్ట్ మెసేజ్ సర్వీస్) పుట్టింది. 160 అక్షరాల్లోనే సందేశం పంపాల్సి ఉండడంతో పదాల నిడివి తగ్గింది.

ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల రాకతో ఈ పిచ్చి పీక్స్ కెళ్లింది. అది ఎంతంటే.. నిన్నటి Thks (థ్యాంక్స్) ఇప్పుడు Txs అయింది. అంటే నాలుగు నుంచి మూడక్షరాలు.

‘ఎందుకిలా తప్పు తప్పుగా రాస్తున్నారు?’ అంటే ‘తప్పుపూంచడానికి ఇది టెక్ట్స్‌బుక్ కాదు. ఫేస్‌బుక్’ అంటోంది ఈ జనరేషన్.
అయినా, మార్పు అనేది సహజం. భాష కాలంతోపాటు కచ్చితంగా మారుతుంది. ఇక యూత్ గురించి చెప్పాల్సిందే లేదు. ఏం చెప్పాలన్నది ముఖ్యం కాదు.. ఎన్ని తక్కువ అక్షరాల్లో చెప్పాలన్నదే వారి లక్ష్యం. అందుకే ఈ పరిణామం.

బాగా గమనిస్తే తరుగుతున్న ఈ భాషా పోకడ ఐదు రకాలుగా కనిపిస్తుంది.
మొదటిది పదాల మొదటి అక్షరాలను ఉపయోగిస్తూ రాయడం..LOL - laugh out loud లాంటిది.
రెండోది.. రిడక్షన్.. పదంలోని అక్షరాలను తగ్గించడం.. సెకండ్‌ని sec అని, మినిట్‌ని, మినిమమ్‌ని min అని రాయడం...

పిక్టోక్షిగామ్స్ మూడోది. సింబాలిక్‌గా.. సీ యూని.. c u అని, లవ్ యూని l u అని రాస్తారు.
నెంబర్స్ రీప్లేసింగ్.. 1-won, 2-to, 4-for, -ate అని రాయడం నాలుగో పద్ధతి.
ఎవరికి వారు ఇష్టానుసారం రాసుకోవడం ఐదో రకం. ఇది ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఉంటుంది.

అమెరికాలోని లాంగ్వేజ్ క్రియేషన్ సొసైటీ అధ్యక్షులు డేవిడ్ పీటర్సన్ తెలిపిన షార్ట్ లాంగ్వేజ్ గురించిన వివరాలివి. ‘షార్ట్ అండ్ స్వీట్ లాంగ్వేజ్‌లో ఒక స్టైల్ ఉంటుంది. అది నేటివ్ ఫ్లేవర్‌తో మిక్స్ అయి మనుషుల్ని అడిక్ట్ చేసేస్తోంది. పిల్లలు పరీక్షల్లో కూడా ఆ లాంగ్వేజ్ వాడే స్థాయికి వెళ్తోంది’ అంటారు పీటర్సన్.

నవలా రచయిత చేతన్ భగత్ ‘రెవల్యూషన్ 2020’లో గోపాల్, ఆర్తీల ‘ఛాటింగ్’ని ఈ లాంగ్వేజ్‌లోనే రాశారు. ‘ఎ ఢిల్లీ - ముంబై లవ్ స్టోరీ’ నవలలో కూడా హింగ్లీష్, ఎసెమ్మెస్ భాషనే వాడారు. అంటే ఈ భాష పుస్తకాల్లోకి ఎక్కింది. ఇక పాఠ్యపుస్తకాల్లోకీ ఎక్కితేనే ప్రమాదం. ‘ఈ-తరం అలా రాస్తేనే ఇష్టపడుతోంది. అందుకే రాస్తున్నాం’ అంటారు చేతన్.

ఆదరణ ఉంది సరే. పదాలు పలుచబడి.. కనుమరుగవుతాయా? ఈ మార్పు భాష మనుగడను దెబ్బ తీసే ప్రమాదం ఉందా? ఔననే అంటున్నారు కొందరు భాషా ప్రియులు. నిజమే ఉంది.. ఆ ప్రమాదమూ ఉంది. ఎందుకంటే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ లాంటి భాషల్లోనూ ఈ మార్పు మొదలైంది. ఇది ఇతర భాషలకూ వ్యాపిస్తోంది. మొబైల్ ఫోన్లలోనూ తెలుగు ఫాంట్ ఓపెన్ అయ్యే టెక్నాలజీ ఇప్పుడు వస్తోంది. అంటే ఇంటర్‌నెట్‌లో తెలుగు విస్తృతంగా వాడే రోజులొస్తున్నాయి. అప్పుడు తెలుగు పదాల రూపం కూడా మారుతుందేమో. ఏమో....ఏదైనా జరగవచ్చు!

స్వల్పంగా భయపడదాం.
భయపడుతూనే, భాషా... v mis u...అని వాపోతున్నా...

ఇవీ కొన్నింటి అర్థాలు..
Gr : గ్రేట్
Xlnt : ఎక్సపూంట్
Kiss : కీప్ ఇట్ సింపుల్ అండ్ సిల్లీ
Rntv : ఆరంట్ వీ
Time : టియర్స్ ఇన్ మై ఐస్
Ttyl : టాక్ టు యు లేటర్
Rofl : రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ అండ్ లాఫింగ్
Tbh : టు బి హానెస్ట్
ASAP : యాజ్ సూన్ యాజ్ పాసిబుల్

2 comments:

G.P.V.Prasad said...

అందుకే ఇలా సందేశాలు పంపే వాళ్ళకోసం అనుకుంటా, గుంతకొక GRE coaching ప్రాంతాలు హైదరాబాదు లో లేచాయి

వనజ తాతినేని/VanajaTatineni said...

ఈ వెర్రిని నిరోదించడం కూడా సాధ్యమే కదా! ప్రయత్నించడం అవసరం కదండీ!!