Skip to main content

Posts

Showing posts with the label నగేష్ బీరెడ్డి

కొన్ని వేల మరణాల తర్వాత ఒక జననం..

కొన్ని వేల మరణాల తర్వాత ఒక జననం.. జననం అంటే ఇక్కడ పుట్టుక కాదు.. ఒక రూపు రావడం.. పుస్తకం రాయడం పూర్తి కావడం..   తొమ్మిదో నెలలో ప్రసవ వేదన కాదు.. తొమ్మిది నెలలుగా అంతర్మథనం.. Oka Nazia Kosam   రాయడం పూర్తయింది. అతి త్వరలో మీ చేతుల్లోకి రాబోతోంది.. ఆదరిస్తారని ఆశిస్తూ... - నగేష్ బీరెడ్డి

అనన్య పర్వం - ఒక నజియా కోసం.. నవల ముందుమాట

*Shall we meet today for lunch*  ఒక మెసేజ్ ఎప్పుడో వచ్చి సెల్ ఫోన్ Inboxలో కూర్చుంది.  ఎవరు పంపిండ్రో. ఊరు లేదు. పేరు లేదు. ఆలోచిస్తూ ‘but who r u ?’ రిప్లయి ఇచ్చా ‘ananya’ రిప్లె వచ్చింది.  అనన్య? ఎవరీ అనన్య?? ఆరు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు గుర్తు చేసుకోవడానికి. టక్కున తట్టింది.  యస్.. అనన్య. షార్ట్ ఫిల్మ్ మేకర్. ముంబై. మంచి సందేశంతో షార్ట్ ఫిల్మ్ తీసింది. నిర్భయ గురించి. రెండు వారాల క్రితం.. యూట్యూబ్లో చూశాను. ‘జిందగీ’కి స్టోరీ చేయాలనిపించింది. ఫేస్బుక్లో వెతికి పట్టుకుని, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. కానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాతి రోజు మెసేజ్ పెట్టాను. ఇంటర్వూ కావాలని.. ఇన్ బాక్స్ లో  తెలియని అమ్మాయిలు వెంటనే రిప్లె ఇవ్వరు. అనుకున్నాను.. కానీ అనన్య ఇచ్చింది.  ‘థ్యాంక్యూ బాస్! మీ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. అదేంటి నేను వెతుకుతున్న వ్యక్తి నాకే మెసేజ్ పెట్టారని. ఇట్స్ ఏ మిరాకిల్!’ అంది మెసేజ్లో.  ‘వాట్ నన్ను వెతుకుతున్నారా? ఆశ్చర్యంగా ఉందే! ఎందుకు?’ టెక్ట్స్ చేశా. ‘చెప్తా. బట్ ఇప్పుడు కాదు (స్మైలీ)’  ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట...

నజియా కోసం.. ఒక పేజీ.. (1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమ కథ)

అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.. అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన.. ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా.. ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం.. నజియా పుస్తకానికి సంబంధించిన అప్ డేట్స్ అందించేందుకు ఫేస్ బుక్ లో ఒక ప్రత్యేక పేజీ క్రియేట్ చేశాం. ఒక నజియా కోసం : Oka Nazia Kosam ఈ కథ మీద మీకు ఆసక్తి ఉంటే ఎప్పటి కప్పుడు అపడేట్స్ తెలుసుకునేందుకు పై లింక్ క్లిక్ చేసి లైక్ నొక్కండి.. పోస్టు వివరాలు మీకు కనిపిస్తాయి.. 

జనవరి 2014 మొదటి వారం కినిగె టాప్ టెన్ పుస్తకాలలో ఫేస్ బుక్ గైడ్

జనవరి 2014 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు Posted on  January 3, 2014   by  somasankar జనవరి 2014 మొదటి వారంలో  కినిగె పై టాప్ టెన్ పుస్తకాలు 1.  నవ్విపోదురుగాక…  –  కాట్రగడ్డ మురారి 2.  రామ్@శృతి.కామ్  –  అద్దంకి అనంత్‌రామ్ 3. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్  –  శ్రీనివాస్ 4.  మిథునం …  –  శ్రీరమణ 5.  మర్డరింగ్ డెవిల్స్  –  మధుబాబు 6.  ఫేస్‌బుక్ గైడ్  –  నగేష్ బీరెడ్డి 7.  వోడ్కా విత్ వర్మ  –  సిరాశ్రీ 8.  రామాయణ విషవృక్షం  –  రంగనాయకమ్మ 9.  అమ్మ కడుపు చల్లగా  –  గొల్లపూడి మారుతిరావు 10.  100% నవ్వు కథలు  –  వడ్లమన్నాటి గంగాధర్ http://teblog.kinige.com/?p=3034