Skip to main content

Posts

Showing posts with the label youtube addiction

యమ ఫేక్‌తుండ్రు

‘‘హౌ ఆర్ యు మై బోయ్? నేను, మీ అమ్మ బావున్నాం. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. వెంటనే చూడాలనిపిస్తోంది. సో.. నీ పీసీ ఆఫ్ చేసి కిందికి వచ్చేసెయ్. కలిసి భోజనం చేద్దాం...’ ఒక తండ్రి తన కొడుకు ఫేస్‌బుక్ వాల్‌పై ఇలా పోస్ట్ చేశాడు.  ఒకతనికి ఉరిశిక్ష పడింది. ‘నీ చివరి కోరిక ఏంటి?’ అని అడిగాడు జడ్జి. ‘నన్ను ఉరితీస్తున్నట్లు నా ఫేస్‌బుక్ స్టేటస్‌ని అప్‌డేట్ చేయాలి’ సమాధానమిచ్చాడతడు. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఆంబుపూన్స్‌లో ఆస్పవూతికి తీసుకొచ్చారు. కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పాడు డాక్టర్. ‘మీ వాళ్లకి ఏమైనా చెప్పాలా? అడిగింది నర్స్. ‘ఒకవేళ నేను చనిపోతే నా మొహంపైన వెంటనే గుడ్డ కప్పేయండి. లేదంటే మా ఫ్రెండ్స్ వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతారు’ సమాధానమిచ్చాడు  అబ్బాయి.  నిజమే... ఇవి జోకులే కావొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషులు ఇలాగే తయారయ్యారని అనిపిస్తోంది.రెండు రోజుల క్రితం అసోం రాజధాని నగరంలో 20 మంది యువకులు ఒక అమ్మాయిపై దాడి చేశారు. దాన్ని ఒక ఛానెల్‌వాళ్లు వీడియో తీశారు. ఇంకొకరు యూట్యూబ్‌లో పెట్టారు. అందులో ఒక యువకుడు తెల్లటి చారలున్న ఎర్ర టీ...