Skip to main content

Posts

Showing posts with the label samsung galaxy s3

స్మార్ట్ వార్ : యాపిల్ X స్యామ్‌సంగ్‌ X నోకియా

ఐఫోన్ 5 విడుదలయ్యింది. అది స్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3కి పోటీ అయింది. హెచ్‌టీసీ వన్ ఎక్స్‌లోనూ ఈ రెండింటిలో ఉన్న ఫీచర్లే ఉన్నాయి. వీటి మధ్య ఉన్న పోటీకి ఐఫోన్5 ఇప్పుడు ఇంకా పోటీనిస్తోంది. త్వరలో నోకియా కూడా లుమియా 920 ఫోన్ ంచ్ చేయబోతోంది. మొత్తంగా ఒక ‘స్మార్ట్’ వార్ జరుగుతోంది. ‘యాపిల్’ లోగోలో యాపిల్‌ని ఎవరు కొరికారు? స్యామ్‌సంగ్! ఫేస్‌బుక్‌లో రొటేట్ అవుతున్న జోక్ ఇది. ఐఫోన్, స్యామ్‌సంగ్‌లు కోర్టుకెక్కిన విషయం మీకు తెలిసే ఉండొచ్చు. అది వేరే విషయం. ఇప్పుడు యాపిల్ ఐఫోన్5 విడుదలయింది. దీంతో ఇప్పటి వరకు లీడింగ్‌లో ఉన్న స్యామ్‌సంగ్‌కి భయం పట్టుకుంది. అందుకే ఇంగ్లీష్ పేపర్లలో పేజీల కొద్ది యాడ్స్ ఇస్తోందని అంటున్నారు విమర్శకులు. ఏ కంపెనీ సరికొత్త ఫోన్‌ని విడుదల చేసినా అది తమ మార్కెట్‌ని పెంచుకోవడం కోసమే. అందుకోసం రకరకాల ఫీచర్లని, అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తుంటాయవి. అలా వచ్చిన స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్, స్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్ ఎక్స్ ఇప్పుడు పోటీ పడుతున్నాయి. త్వరలో విడుదల కానున్న నోకియా మియా 920 కూడా ఇదే బరిలోకి రానుంది. అందుకే ఏ ఫోన్‌లో ఏ ఫీచర్లు ...