Skip to main content

Posts

Showing posts with the label product camparision

కంపేర్ చేసుకోవడానికి ఇవి కంఫర్ట్‌గా ఉంటాయి

మీరొక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నారు. ఏది కొంటారు? ఏ కంపెనీది బావుంటుంది? దేంట్లో మీకు కావాల్సిన ఫీచర్లు ఉంటాయి? అవే ఫీచర్లు ఉన్న ఫోన్ ఏ కంపెనీది తక్కువకు దొరుకుతుంది?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఒక్క క్లిక్‌తో సమాధానాలు వెతకొచ్చు. అదే ప్రొడక్ట్స్ కంపారిజన్. ఒక గాడ్జెట్‌ని ఇంకో గాడ్జెట్‌తో పోల్చుకోవడం. అందుకు ఉపయోగపడే వెబ్‌సైట్లే ఇవి. టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పీసీ.. వస్తువు ఏదైనా.. కంపేర్ చేసుకోవడానికి ఇవి కంఫర్ట్‌గా ఉంటాయి. సీనెట్ రివ్యూస్ https://reviews.cnet.com ఇది కూడా చాలా పాపులర్ వెబ్‌సైట్. ఇందులో వినియోగదారుల రివ్యూలతోపాటు, నిపుణుల అభివూపాయాలు కూడా జతచేసి ఉంటాయి. నిపుణులు స్వతాహాగా వాడిన తర్వాతే రివ్యూ రాస్తారు. దీన్ని బట్టే ప్రొడక్ట్స్ పట్ల ఇందులోని అభివూపాయాలను ఎంతవరకు నమ్మొచ్చో అర్థమవుతుంది. ప్రోన్టో www.pronto.com ‘బెస్ట్ ఆన్‌లైన్ ప్రైస్ కంపారిజన్ వెబ్‌సైట్’గా కిప్‌లింగర్ కంపెనీ ప్రోన్టో వెబ్‌సైట్‌ని గుర్తించింది. ఓవర్ స్టేట్‌మెంట్‌ల కంటే ఫ్యాక్ట్స్‌కే ఇందులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 70 మిలియన్ల ఉత్పత్తులకు సంబంధించిన రివ్యూలున్నాయి. రెండున్నర లక్షల ఆన...