Skip to main content

Posts

Showing posts with the label Most Anticipated Video Games of 2012

లెట్స్ ప్లే Most Anticipated Video Games of 2012

ఊహించని మలుపులు.. ఊహకందని ఎత్తులు..   అదో లోకం...   అక్కడ మీరే హీరో   గెలిస్తేనే! లేదంటే జీరో అవుతారు.   ప్రపంచం ఆశగా ఎదురుచూసిన..   చూస్తున్న కొన్ని వీడియో గేమ్స్ గురించే ఈ బైట్స్. ఫైనల్ ఫాంటసీ - XIII-2 స్వేర్ ఎనిక్స్ కంపెనీ రూపొందించిన ఫైనల్ ఫాంటసీ వీడియో గేమ్ పోయిన సంవత్సరం పెద్ద హిట్ అయింది. దీన్ని మరింత మెరుగు పరిచి ఇప్పుడు సీక్వెల్‌ని విడుదల చేసింది ఆ కంపెనీ. ప్లే స్టేషన్ 3, ఎక్స్‌బాక్స్360 ప్లాట్‌ఫామ్స్ మీద ఈ గేమ్‌ని సింగిల్ ప్లేయర్ ఆడొచ్చు. కినెక్ట్ స్టార్ వార్స్ స్టార్ వార్స్ ఇష్టపడని వీడియో గేమ్ లవర్స్ ఉంటారా? కదా.. అలాంటి వారికి ఇది మరింత కిక్కిచ్చే గేమ్. పిల్లలకు ఎక్కువ థ్రిల్‌ని కలిగించే ఈ గేమ్‌ని టెర్మినల్ రియాలిటీ కంపెనీ డిజైన్ చేసింది. దీన్ని ఎక్స్‌బాక్స్ 360 ప్లాట్‌ఫామ్ మీది ఆడొచ్చు.   మాస్ ఎఫెక్ట్ 3 మస్త్ మజానిచ్చే పక్కా యాక్షన్ రోల్ ప్లేయింగ్ గేమ్ ఇది. బయోవేర్ అనే కంపెనీ డెవలప్ చేసింది. దీన్ని ప్లేస్టేషన్ 3, ఎక్స్‌బాక్స్360 ప్లాట్‌ఫామ్స్‌తో పాటు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ మీద కూడా ఆడొచ్చు. సింగిల్ ప్లేయర్, మల్టీ ప్లేయర్లు ఆడొచ్చు.   మ...