ఇంగ్లీషులో జనాదరణ పొంది, ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమైన 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్'కి తెలుగు అనువాదం ఈ పుస్తకం. నలుగురు నడిచే దారిలో మనం నడిస్తే థ్రిల్ ఏముంటుంది? మనమే ఓ కొత్త మార్గాన్ని కనిపెడితేనే ఉంటుంది మజా. కానీ ఆ కొత్తబాటలో ఎన్నో ముళ్లుంటాయి. రాళ్లు రప్పలుంటాయి. ఎత్తుపల్లాలుంటాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌లో చదివి తమ భవిష్యత్తుకు అలా బంగారుబాటలు వేసుకున్న 25 మంది వ్యాపారవేత్తల విజయగాథల్ని ఈ పుస్తకంలో వివరించారు రచయిత్రి. 'వ్యాపార రంగంలో ఎదగాలని ఎంతోమందికి ఉంటుంది. ఒకవేళ అలా జరిగివుంటే నేను కోటీశ్వరున్ని అయిఉండేవాడ్ని.. ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈపాటికి కంపెనీ పెట్టి ఉండేవాడ్ని.. ఇలా మనం చాలాసార్లు అనుకుంటుంటాం. ఈ 'ఒకవేళలు' మనం కనే పగటి కలలు కావు. అవి మన ఆశలు, ఆకాంక్షలు, మన స్వప్నాలు. మనం 'ఏదో ఒకరోజు' అనే పెట్టెలో వీటిని భద్రంగా మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువునీ, తర్కాన్నీ కలరా ఉండల్లా వాటి పక్కనబెట్టి భద్రంగా ఉంచుతాం. ఆ తర్వాత దాన్ని మరిచిపోయినవాళ్లు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను ఎవరు చేజిక్కించుకు...