Skip to main content

Posts

Showing posts with the label npdo

నడవలేడు.. నడిపిస్తున్నాడు...

డాన్ బాస్కో రిహాబిలిటేషన్ సెంటర్, రామంతాపూర్, హైదరాబాద్ వికలాంగుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.  ఒక వికలాంగుడు కన్నీరు పెడుతూ పాట పాడుతున్నాడు.. వింటున్న వారిలోంచి ఒకాయన లేచి.. ‘‘ఆపండి.. ఏడిపించే ఇలాంటి పాటలొద్దు. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం. ఇక చాలు. వికలాంగుల్లో ధైర్యం పెంచే పాటలు పాడండి. ఆశ నింపే మాటలు చెప్పండి. జై వికలాంగ్’’ అని కష్టంగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్. వికలాంగులకు నాయకుడు.  నెల రోజుల తర్వాత.. ఎన్‌పిడిఓ కార్యాలయం, మలక్‌పేట ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్‌ని కలిసేందుకు వచ్చారు. తాము తీయబోతున్న డాక్యుమెంటరీ కోసం ఒక వికలాంగ బాలుడు కావాలని అడిగారు. కథేంటని అడిగారు శ్రీనివాస్. వచ్చిన వారు క్లుప్తంగా చెప్పారు. ‘‘బావుంది. నథింగ్ ఎబౌట్ అజ్ వితౌట్ అజ్.. మేం లేనిదే మా గురించి వద్దు.. మమ్మిల్ని పనికిరాని వాళ్లుగా కాదు.. మేమూ సాధించగలమని చూపించండి’’ అన్నారు శ్రీనివాస్. ఈ రెండు సంఘటనలు చాలాఉ ఆయనేంటో చెప్పడానికి, ఏనుగమ్మ ఏనుగు అని భుజాల మీద ఆడించిన తండ్రి తన కొడుకు నడవలేడని తెలిసి ఆ రోజు బాధపడి ఉంటారు. కానీ ఈ రోజు ‘‘నా కొడుకు వికలాంగు...