Skip to main content

Posts

Showing posts with the label helen keller's institute of research and rehabilitation for the disabled children

వీళ్లు గుండె మీద చెయ్యేసి చెప్పేస్తారు...

వారికి ప్రపంచం మ్యూట్‌లో పెట్టిన టీవీలా కనిపిస్తుంటుంది. పసిపాప నవ్వు.. కోకిల పాట.. సెలయేటి హోరు.. రైలు కూత.. ఇలా అన్ని శబ్దాలూ వారికి జీరో డెసిబెల్‌లోనే వినిపిస్తాయి. మరి టీచర్లు చెప్పే పాఠాలు వారికెలా వినిపిస్తాయి? నిన్న బధిరుల దినోత్సవం సందర్భంగా ఎల్‌కేజీ నుంచి పిజీ వరకు కేవలం బధిరుల కోసమే ఉన్న ఒక ఇనిస్టిట్యూట్‌కి వెళ్లాను. అక్కడ అక్కడ ఈ కింది 'మ్యూటీఫుల్‌' సీన్స్‌ కనిపించాయి. సికింద్రాబాద్‌లోని రామకృష్ణాపురం.... నిండా నీళ్లతో నిండు గర్భిణిలా ఉన్న చెరువుని చూస్తూ ఫ్లైఓవర్‌ దిగగానే రైల్వే బ్రిడ్జీ కనిపించింది. బ్రిడ్జీకి కుడివైపు 'హెలెన్‌ కెల్లర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ ది డిసేబుల్డ్‌ చ్రిల్డన్‌' అనే బోర్డు ఉంది. ఆ ఇనిస్టిట్యూట్‌లో చాలా 'ప్రత్యేకమైన' పిల్లలు 600 మంది చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలుంటేనే ఇల్లు మారుమోగిపోతుంది. అలాంటిది అంత మంది పిల్లలున్న ఆ పాఠశాలలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆశ్చర్యం లేకపోయినా ఏదో ఖాళీ. శబ్దం లోపించిన ఖాళీ. సైగలతో చదువులు, మౌనంగా ఆటలు.. కనిపించాయి అక్కడ. (శారీరక, మాన...