Skip to main content

Posts

Showing posts with the label beeru seesa

బీరుసీసాలో బీరకాయ

‘‘నాన్న! ఒక కథ చెప్పు నాన్న...’’ అడిగింది కీర్తి.   ‘‘ఇప్పుడు కథేంటి, పడుకోమ్మా..?’’ అన్నాడు శ్రీరామ్.  ‘‘లేదు నాన్న.. చెప్పు నాన్న’’ ‘‘కార్టూన్ ఛానెల్ చూడమ్మా’’ ‘‘టీవీ వొద్దు. కథనే కావాలి. ప్లీజ్ నాన్న చెప్పు నాన్నా..’’ ‘‘సరే.. ఏం కథ చెప్పాలి.. అనగనగా ఒక రాజు...’’ ‘‘ఆ తెలుసు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, వారు వేట కెళ్లారు... చేపలు తెచ్చారు. అదంతా పాత కథ నాన్నా.. ఏదైనా కొత్త కథ చెప్పు’’ ‘‘కొత్త కథా?... అయితే నీకు బంటిగాడి కథ చెబుతా?’’ ‘‘బంటిగాడా?’’ ‘‘అవును.. బంటిగాడి కథ. వాళ్ల డాడీ హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్. చాలా బిజీ మనిషి. బంటీ కోసం ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేసేవాడు కాదు. అప్పుడు బంటి.. వాళ్ల అమ్మ దగ్గరికెళ్లి అడిగాడు ‘మమ్మీ! డాడీ నాతో ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేయడు ఎందుకని?’ ‘డాడీ బిజీ కదరా. నీ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు’ అని చెప్పింది ఆమె. ‘నా కోసమా? ఎంత సంపాదిస్తున్నాడు’ ‘నెలకు పది లక్షల రూపాయలు’ బంటీ వాళ్ల డాడీ లేట్ నైట్ ఏదో రాసుకుంటున్నాడు. బంటి భయం భయంగా దగ్గరికి వెళ్లి ‘డాడీ! నాతో రేపు ఒక గంట టైమ్ స్పెండ్ చేస్తారా?’ ‘లేదురా. రేపు ఇంప్టాంట్ మీ...