బ్లూటూత్ ఇప్పుడొక ఫ్యాషన్ యాక్సెసరీ. ఒకప్పుడు బిజినెస్‌మెన్, సెలబ్రిటీలు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో లభించే ఫోన్లలో కూడా బ్లూటూత్ ఆప్షన్ ఉంటోంది. బైక్ నడిపేటప్పుడు, ఎక్కువసేపు ఫోన్లే మాట్లాడేప్పుడు బ్లూటూత్ హెడ్‌సెట్‌ని వాడడం కంఫర్ట్‌గా ఉంటుంది. మీరు వాడే ఫోన్‌కి ఎలాంటి బ్లూటూత్‌ని ఎంచుకోవాలి? పర్ఫెక్ట్ బ్లూటూత్ గురించి తెలిపే గైడ్‌లైన్స్ ఇవి. 1. కాల్ క్వాలిటీ బ్లూటూత్ కొనేముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఇది. ఫోన్‌లో మాట్లాడేప్పుడు వాయిస్ క్లారిటీ ఎంత క్లియర్‌గా ఉందో చూడాలి. ఎదుటివాళ్ల మాటలు మీకు ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయో మాత్రమే కాదు.. మీ మాటలు కూడా ఎదుటివారికి ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయో కూడా చూడాలి. మీ వాయిస్ మాత్రమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా ఎక్కువగా రాకుండా చూసుకోవాలి. 2. బ్యాటరీ పవర్ బ్లూటూత్ హెడ్‌సెట్‌కు కూడా ప్రత్యేకమైన ఛార్జర్ ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టి వాడితే రెండు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసే బ్లూటూత్‌లు మార్కెట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లో ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉ...