Skip to main content

Posts

Showing posts with the label janagaam

ఎవడు కొడితే దిమ్మ దిరిగి బొమ్మవుతుందో వాడే మైకెల్‌ జాక్సన్‌

కార్పొరేట్‌ స్కూలు పిల్లలు బడి గడప దాటకముందే ప్రపంచంతో పోటీ పడుతుంటారు. సర్కారు బడి పిల్లలు చదువు పూర్తయ్యాక కూడా ప్రపంచంతో పోటీ పడలేక ఉన్నచోటే ఆగిపోతారు. ఇద్దరూ బడిపిల్లలే అయినా ఎంత తేడా? ఈ తేడాని తుడిపేసేందుకు బొమ్మని భుజానేసుకుని ఊరూరా తిరుగుతున్నాడు కొండా శ్రీనివాస్‌. మాటలు నేర్చిన ఆ బొమ్మ తన బాస్‌ శ్రీనివాస్‌ గురించి ఏం చెబుతుందో వినండి. ఎవడు కొడితే దిమ్మ దిరిగి బొమ్మవుతుందో వాడే మైకెల్‌ జాక్సన్‌. అంటే నేనే. ఉట్టి బొమ్మనే అని తీసిపారేయకండి. ఈ బొమ్మే లేకపోతే శ్రీనివాస్‌ లేడు. శ్రీనివాసే లేకపోతే సర్కారు బడిపిల్లలకు దారి చూపించేవాడే లేడు. అంత సీన్‌ లేదంటరా? అయితే మా బాసు శ్రీనివాస్‌ గురించి మీకు చాలా చెప్పాలి. ఆయనో బతకలేని... కాదు.. కాదు బతకనేర్చిన బడిపంతులు. బడిపిల్లలకు బతుకు నేర్పుతున్న సర్కారు బడిపంతులు. నేను చిన్నప్పటి నుంచీ ఆయన వెంబడి ఏం లేను. రెండేళ్ల కిందటే నన్ను కొట్టుకొచ్చాడు.. సారీ.. కొనుక్కొచ్చాడు. అప్పుడు నేను "అసలు నన్నెందుకు తీసుకొచ్చావు?'' అని అడిగాను. "నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లకు మనం పాఠాలు చెప్పాలి'' అన్నాడు. "పాఠాలా!...