టెక్నాలజీ స్లిమ్ అయిపోతోంది. కంప్యూటర్ కూడా మొబైల్ ఫోన్లోకి మారిపోతోంది. అయినా పీసీ స్టైల్ పీసీదే. అందుకే పర్సనల్ కంప్యూటర్లలో ఇంకా కొత్తవి, ఆధునాతనమైనవి వస్తూనే ఉన్నాయి. ఒక హైఫై పర్సనల్ కంప్యూటర్ కావాలంటే కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి? ఒకటి రెండు కాదు.. అన్ని ఫీచర్లు, అద్భుతమైన వేగంతో పనిచేసే కంప్యూటర్లు ఉంటాయా? ఉంటాయి... అవే ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు. లెనోవా ఐడియా సెంటర్ బీ520 23 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 3డీ డిస్‌ప్లే గల ఈ కంప్యూటర్‌లాంటి కంప్యూటర్‌ని మీరు చూసి ఉండరు. దీని అద్భుతమైన పెర్మామెన్స్, స్పీడును బట్టి ఇదో బెస్ట్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్‌గా చెప్పొచ్చు. ప్రాసెసర్ : 3.40 జీహెచ్‌జెడ్ ఇంటెల్ కోర్ ఐ7-2600 ర్యామ్ : 8జీబీ డీడీఆర్3 ఎస్‌డీ హార్డ్‌డ్రైవ్ : 2 టీబీ (7200 ఆర్‌పీఎం) కెమెరా : ఉంది ప్లస్‌లు : టీవీ ట్యూనర్, 3డీ ఫీచర్స్, కార్డ్ రీడర్, హెచ్‌డీఎంఐ ఇన్‌పుట్ అవుట్‌పుట్. మైనస్‌లు : యూఎస్‌బీ 3.0 పోర్టులు లేవు. ధర : $ 1037, ₹ 59,200 స్యామ్‌సంగ్ సిరీస్ 7 ఆల్ ఇన్ వన్ స్యామ్‌సంగ్ కంపెనీ రూపొందించిన ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లలో సిరీస్ 7 ఒకటి. దీన్నే డీపీ700ఏ3బీ పే...