Skip to main content

Posts

Showing posts with the label be ready

ఒక డైనోసార్‌ని దోమ కాటేసిoది

1993లో ఒక సినిమా వచ్చింది. పేరు ‘జూరాసిక్ పార్క్’. అనగనగా ఒక దోమ... డైనోసార్లు జీవించే కాలంలో అది ఒక డైనోసార్‌ని కాటేస్తుంది. రక్తం పీల్చి ఆనందంతో ఎగురుతుంది. ఆకస్మాత్తుగా అదొక ఆపదలో ఇరుక్కుంటుంది. ఒక చెట్టు నుంచి కారే జిగురులో అది చిక్కుకుని చనిపోతుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత... ఆ జిగురు చరిత్ర పరిశోధకులకు దొరుకుతుంది. అందులోని దోమ రక్తం నుంచి డీఎన్‌ఏని సేకరించి శాస్త్రవేత్తలు మళ్లీ డైనోసార్లకు ప్రాణం పోస్తారు. అలా ప్రాణం పోసిన డైనోసార్లతో జూరాసిక్ పార్క్‌ని ఏర్పాటు చేస్తారు. స్పీల్‌బర్గ్ రాసుకున్న స్రిప్టు ఇది. హాలీవుడ్ సినిమాల్లో ఒక రివల్యూషన్‌ని క్రియేట్ చేసింది. 1995లో ఇంకో సైన్స్ ఫిక్షన్.. గ్యారీ జోన్స్ తీసిన ‘మస్కిటో’ సినిమా. ఒక చిత్తడి నేలలో దోమలు అప్పుడే ప్రాణం పోసుకుంటుంటాయి. ఆకాశం నుంచి ఒక అంతరిక్ష నౌక అక్కడ కుప్పకూలుతుంది. దాని ప్రభావం దోమలపై పడి విపరీతంగా పెరిగి వికృతంగా ప్రవర్తిస్తుంటాయి. దగ్గరలో క్యాంపు వేసుకుని ఉన్న మనుషులపై అవి దాడి చేస్తుంటాయి. వారు ఆ దోమల్ని ఎలా ఎదుర్కొన్నారనేది కథ. ఖర్చు చేసిన బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కలెక్ష...

2070లో ఒకరోజు..

కరణ్ అప్పుడే నిద్రలేచాడు. మెయిడ్ రోబో (పని మనిషి) కాఫీ తెచ్చి ఇచ్చింది. ఇంటి గోడలో ఇన్‌బిల్ట్ అయిన టీవీ ఆటోమెటిగ్గా ఆన్ అయింది. టీవీ 149.. అన్నాడు. టీవీలోని వాయిస్ రికగ్నైజేషన్‌తో టీవీ ఛానెల్ మారింది. ‘‘ఈ రోజు ఉష్ణోగ్రత 55 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు. రేడియేషన్ ఒక యూనిట్‌కి నానో గ్రే పర్ ఆవర్స్‌గా ఉంది. సేఫ్టీ గార్డ్స్ లేకుండా ఎవరూ బయటికి రావొద్దు..’ టీవీలో వార్తలొస్తున్నాయి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం ఆ రోజు రాత్రి.. మైండ్‌లోని ఆలోచనలన్నీ ఆన్‌లైన్ పర్సనల్ క్లౌడ్ స్టోరేజీలో దాచిపెట్టుకున్నాడు కరణ్. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. అందుకే ‘ఈ రోజు షెడ్యూల్ ఎంటీ?’ అని మనసులో అనుకున్నాడు. పర్సనల్ ఇంటరాక్షన్ డెస్క్‌టాప్ సిస్టమ్‌లో మైండ్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఆన్ అయింది. క్లౌడ్ స్టోరేజీ నుంచి కరణ్ మెమరీని బ్యాకప్ తీసుకుని.. లి-ఫై ద్వారా కరణ్‌తో కనెక్ట్ అయి అతని మెమరీని అప్‌గ్రేడ్ చేసింది సిస్టమ్. ఆ తర్వాత కరణ్ రోటీన్ డైలీ షెడ్యూల్ మొదలైంది. ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ కాదు. ఆన్‌లైన్‌లో కనిపించే కొన్ని హారబుల్ ఫ్యాక్ట్ ఆధారంగా అల్లిన ఒక ఊహ. ఇప...

బీరుసీసాలో బీరకాయ

‘‘నాన్న! ఒక కథ చెప్పు నాన్న...’’ అడిగింది కీర్తి.   ‘‘ఇప్పుడు కథేంటి, పడుకోమ్మా..?’’ అన్నాడు శ్రీరామ్.  ‘‘లేదు నాన్న.. చెప్పు నాన్న’’ ‘‘కార్టూన్ ఛానెల్ చూడమ్మా’’ ‘‘టీవీ వొద్దు. కథనే కావాలి. ప్లీజ్ నాన్న చెప్పు నాన్నా..’’ ‘‘సరే.. ఏం కథ చెప్పాలి.. అనగనగా ఒక రాజు...’’ ‘‘ఆ తెలుసు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, వారు వేట కెళ్లారు... చేపలు తెచ్చారు. అదంతా పాత కథ నాన్నా.. ఏదైనా కొత్త కథ చెప్పు’’ ‘‘కొత్త కథా?... అయితే నీకు బంటిగాడి కథ చెబుతా?’’ ‘‘బంటిగాడా?’’ ‘‘అవును.. బంటిగాడి కథ. వాళ్ల డాడీ హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్. చాలా బిజీ మనిషి. బంటీ కోసం ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేసేవాడు కాదు. అప్పుడు బంటి.. వాళ్ల అమ్మ దగ్గరికెళ్లి అడిగాడు ‘మమ్మీ! డాడీ నాతో ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేయడు ఎందుకని?’ ‘డాడీ బిజీ కదరా. నీ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు’ అని చెప్పింది ఆమె. ‘నా కోసమా? ఎంత సంపాదిస్తున్నాడు’ ‘నెలకు పది లక్షల రూపాయలు’ బంటీ వాళ్ల డాడీ లేట్ నైట్ ఏదో రాసుకుంటున్నాడు. బంటి భయం భయంగా దగ్గరికి వెళ్లి ‘డాడీ! నాతో రేపు ఒక గంట టైమ్ స్పెండ్ చేస్తారా?’ ‘లేదురా. రేపు ఇంప్టాంట్ మీ...

జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది. అదే ...

సున్నా అంటే శూన్యం. ఏ విలువా లేకపోవడం. పూర్ణాంకాలు, సహజ సంఖ్యల సంకలనంలో.. బీజగణిత నిర్మాణంలో అదొక సంకలన తత్సమం.చారివూతాత్మకంగా సున్నా వాడుకలోకి వచ్చిన ఆఖరి అంకె. కానీ దాన్ని కనుక్కోవడం గణితశాస్త్రం మొత్తం మీద ఒక విప్లవాత్మకమైన మార్పు. తొమ్మిదో శతాబ్దంలో కర్ణాటకకు చెందిన మహావీరాచార్యుడు ‘గణిత సారసంక్షిగహం’ అనే గ్రంథంలో సున్నా గురించి రాశాడు. ఆ గ్రంథానికి 11వ శతాబ్దంలో పావులూరి మల్లన అనే కవి తెలుగులో కావ్యరూపం ఇచ్చాడు. ఆయన సున్నా గురించి చెప్పిన పద్యం ఇది.సున్నయు, సున్నయు బెంచిన సున్నయు, తత్కృతి ఘనం సున్నయు వచ్చున్ సున్నయు లెక్కయు బెంచిన సున్నయు తానమరి యుండు సుస్థిర రీతిన్. అంటే.. సున్నాని సున్నాతో కూడినా, సున్నాని సున్నాలోంచి తీసివేసినా.. సున్నాని సున్నాతో గుణించినా సున్నానే వస్తుంది. అంతే తప్ప సున్నాకి విలువ లేదా? ఉంటుంది.. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ తన సైజుని ‘జీరో’కి తగ్గించుకున్నాకే ‘హాట్’ ఐకాన్ అయింది. సైజ్ జీరో అనేది దుస్తుల కొలతలకు సంబంధించిన విషయం. 30-22-32 శరీరాకృతి ఉన్నవారే ఆ దుస్తుల్లో ఫిట్ అవుతారు. కరీనా బక్కచిక్కి ఆ ‘జీరో’ బట్టల్లో ఒదిగిపోయింది. ఇంగ్లీష...

రిచ్ డాడ్ కి పూర్ డాడ్ కి తేడా తెలుసుకోండి

కొందరు మెల్లగ ఎలాగో అలాగ బతికేద్దామని పట్నం వస్తుంటారు.  ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటారు. వెయ్యి, రెండు వేలు పెరిగే జీతం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు. పెరిగే ధరల్ని నిందిస్తూ కూర్చుంటారు. అద్దె ఇంటితో అవస్థ పడుతుంటారు. సొంత ఇంటి కల వారికి కలగానే మిగిలిపోతుంది. కానీ, ఇంకొందరు అలా కాదు. ‘బిజినెస్‌మేన్’ సినిమాలో మహేష్‌బాబులా ఉంటారు. తమ కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ‘రిచ్ డాడ్’ గురించి మీకు తెలుసా? అమెరికా రచయిత రాబర్ట్ కియోసా ‘రిచ్ డాడ్ - పూర్ డాడ్’ అని ఒక పుస్తకం రాశాడు. ‘పూర్ డాడ్ పొదుపు చేయమని చెప్తే, రిచ్ డాడ్ మదుపు చేయమని చెప్తాడు. పొదుపుకి మదుపుకి ఒక అక్షరమే తేడా. కానీ వాటి లక్షణమే వేరు. దాన్ని అర్థం చేసుకోవడమే బిజినెస్’ అంటారు కియోసాకి. ఉద్యోగం చేసే వాడు కేవలం ఉద్యోగిగానే మిగిలిపోతాడు. ‘బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది’ అని తన కొడుక్కి నూరిపోస్తాడు. ఆ కొడుకూ అలాగే చేస్తాడు. కానీ రిచ్ డాడ్ అలా కాదు. తన కొడుక్కి డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. ‘డబ్బు వృథాగా ఖర్చు పెట్టకు’ అని ఆయన ఎప్పుడూ చెప్పడు. దాంతో ఆడుకొమ్మంటాడు. అందుకే కొందరు డబ్బుతో ఆడుకొంటు...

ఆరు నూరవుతుంది.

వన్ ఫైన్ మార్నింగ్.. మినీ ట్యాంక్ బండ్, సరూర్‌నగర్. ‘‘ఏంటంకుల్ అంతలా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి పై కప్పులు ఏ రేకుల్తో వేద్దామా అనా?’’ బెంచీ మీద కూర్చున్న ఒకాయణ్ణి అడిగాడు ఒక కుర్రాడు. ‘‘ఓహ్.. నువ్వా శ్రవణ్? అదీ.. మా ఇంటి పై కప్పుల గురించి కాదు.. మా వాడ్ని ఎలా పైకి తీసుకురావాలా? అని’’ ‘‘అరె... ఏమైందంకుల్ వాడికి?’’ ‘‘ఏముంది.. నువ్వు చూడు మంచి ఉద్యోగం చేస్తున్నావ్. వాడికి నీలా పైకొచ్చేందుకు ఒక్క మంచి లక్షణం లేదు. రాత్రి రెండింటి దాక కంప్యూటర్ ముందు.. పొద్దున పదింటికి లేవడం. కాస్త తెల్లారిగట్లయినా లేచి ఏడ్వరా అంటే.. ‘తెల్లారి గట్ల కోడి కూడా లేస్తది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తినేస్తున్నమ్’ అని సినిమా డైలాగులు చెప్తున్నడు.’’ ‘‘లేదంకుల్ వాడు....’’ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు శ్రవణ్. ‘‘నీ వయసులో ఉన్న శ్రవణ్ చూడు నెలకు 50 వేలు సంపాదిస్తున్నాడు’ అని ‘నీ గురించి చెబితే.. ‘నీ వయసులో ఉన్న బిల్‌గేట్స్ మిలియనేర్ అయ్యాడు. మరి నువ్వు?’ అని కౌంటర్లు ఇస్తున్నాడు’’ ‘‘లేదంకుల్.. వాడి గురించి నాకు తెలుసు.. చూడండి వాడు గొప్ప వాడవుతాడు..’’ ‘‘వాడేం బాగుపడతాడు. వాడ్ని చూసి వాడి ...

జస్ట్.. ఒక్క నిమిషంలో ఏం జరుగుతోంది?

కంప్యూటర్ ఆన్‌లో ఉంది.  అది ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయి ఉంది.  ఒక ఈ-మెయిల్ పంపించడానికి ఎంత సమయం పడుతుంది?  జస్ట్.. ఒక్క నిమిషం! ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేయడానికి.. ట్విట్టర్‌లో ట్వీట్ కొట్టడానికి??? అంతే సమయం.. అదే నిమిషం..  అంటే.. కేవలం 60 క్షణాలు... ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? లెక్కల మాస్టారు పాఠం చెప్పినట్లు అంకెలు కాస్త ఎక్కువగా ఉంటాయి, కంగారు పడకండి. ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారు. అందులో ఆసియాకి చెందినవారు 44.8 శాతం మంది ఉన్నారు. సుమారు సగం వాడకందారులు మన ఖండంలోనే ఉన్నారన్నమాట. ఇందులో చైనా వాటా 50 శాతం. 12 శాతంతో మన దేశం రెండో స్థానంలో ఉంది. అంటే భారతదేశ జనాభాలో 10 శాతం మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారన్నమాట. ‘వెబ్’ దునియా: ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల వెబ్‌సైట్లు ఉన్నాయి. 2011లోనే 30 కోట్ల వెబ్‌సైట్లు కొత్తగా చేరాయి. ప్రతి ఒక్క నిమిషంలో 570 కొత్త వెబ్‌సైట్‌లు రిజిస్టర్ అవుతున్నాయి. ‘సోషల్’యిజం: ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్క నిమిషానికి 6,95,000 స్టేటస్‌లు అప్‌డేట్ అవుతున్నాయి. 2,77,000 మంది బుక్(లాగిన్...

రోటీ, కపడా ఔర్ మొబైల్

‘నిన్న చెప్పా పెట్టకుండా పని మానేశావేంటే?’ పనమ్మాయిపై కోప్పడింది యజమానురాలు.  ‘అదేందమ్మ గారు! జర ఒంట్లో సుస్తిగుంది. ఇయాళ రాలేనని మెసేజ్ బెట్టినగద. సూస్కో లేదా?’ సమాధానమిచ్చింది పనమ్మాయి.  --- సెల్ ఒకప్పుడు కేవలం స్టే టస్ సింబల్. కానీ ఇప్పుడు.. నిత్యావసరం. హస్త భూషణం. పుట్టిన తర్వాత వచ్చి చేరే అవయవం. ఒక ఆర్టిఫిషియల్ ఆర్గాన్. కళ్లు లేని కబోధిలా... కాళ్లు లేని అభాగ్యుల్లా... సెల్ లేని వారు ఇప్పుడు అవిటివారు.. అందుకే ఇప్పుడు తాగడానికి నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్ దొరుకుతోంది. పదేళ్ల క్రితం ఒక నిముషం మాట్లాడాలంటే రూ. 32.80 బిల్లు పడేది. ఇప్పుడు ఒక పైసాతో నిముషం మాట్లాడొచ్చు. సిమ్‌కార్డ్ ఫ్రీ.. డబుల్ టాక్‌టైమ్...లాంటి బంపర్ ఆఫర్లు. 2011 అంతానికి మన దేశంలో 81.15 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇంత వేగంగా ప్రజలకు చేరువైన సౌకర్యం మరొకటి లేదు. దేశంలోని మొత్తం మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అందుకే 1జీ పోయింది. 2జీ స్కామ్‌లో ఉంది. 3జీ ఫామ్‌లో ఉంది. 4జీ రానుంది. చైనా తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే మన మ...

వీలైతే ఒకసారి... ఇది చదవడానికి ప్రయత్నించండి.

My hols wr cmpltd. B4, we used 2 go 2 HYD 2c my sis, her hus & thr kids FTF. ILHYD, its a gr plc. చదవడానికి కష్టపడింది చాలు. ‘నా సెలవులు పూర్తయ్యాయి. అంతకంటే ముందు మా సోదరి, ఆమె భర్త, పిల్లల్ని చూడడానికి హైదరాబాద్ వెళ్లాం. ఐ లవ్ హైదరాబాద్. ఇట్స్ ఏ గ్రేట్ ప్లేస్... (My holidays were a completed. Before, we used to go to Hyderabad to see my sister, her husband and kids face to face. I love hyderabad. It is a great place) ఇదీ దాని అసలు అర్థం. రాను రానూ తరిగిపోతున్న మెసేజ్‌లు. OMG! (ఓఎమ్‌జీ అంటే ఓ మై గాడ్ అని) ఇంగ్లీషు మారిపోతోంది. ఇది చూడండి. ఫైన్.. f9 అయింది. టుమారో 2marwగా మారింది. ఆంగ్లంలో ఇలాంటి పదాలు ఇప్పుడు షార్ట్ అయిపోయాయి. పదాల్లో అక్షరాలకు అంకెలు కలిసి కొత్త లిపి తయారయింది. అలా మార్చిన క్రెడిట్ అంతా FB Gen (ఫేస్‌బుక్ జనరేషన్)దే అని చెప్పాలి. యూ (you) అంటే ఇప్పుడు ఒకే అక్షరం (U). స్పెల్లింగ్ మర్చిపోయిన ఈ-తరం ‘ఎక్కడున్నావ్?’ అనడానికి.. wr r u? అని షార్ట్ అండ్ స్వీట్‌గా ఎస్‌ఎమ్‌ఎస్ చేసేస్తోంది. అదీ విషయం! అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? పదాలను పొట్టిగా ఎందుకు...