Skip to main content

Posts

Showing posts with the label self chek

మరకా మంచిదే అని వాళ్లు ఎప్పుడైతే గ్రహించారో.. అప్పుడూ...

మరకా మంచిదే... సర్ఫ్ ఎక్సెల్ ఉన్నప్పుడు! ఇదేదో సర్ఫ్ ఎక్సెల్ ప్రమోషన్ అనుకునేరు... కాదు.. మరకలాంటి విమర్శను వాషవుట్ చేసే ప్రయత్నం. అయితే ఇక్కడ ఈ మరకను పోగొట్టడానికి ఏ కంపెనీ వాషింగ్ టానిక్ లేదు. సెల్ఫ్‌చెక్కే దాన్ని సెట్‌రైట్ చేసే డిటర్జంట్. అందుకే విమర్శా మంచిదే. సెల్ఫ్‌చెక్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు. ‘ఏరా షర్ట్ మీద ఈ మరకలేంటి?’ అని అమ్మ చిన్నప్పుడు తిట్టేది. ‘చిన్నపిల్లాడిలా షర్ట్ మీద ఈ మరకలేంటి?’ అని భార్యామణి గొణుగుతోంది. అప్పుడూ ఇప్పుడూ షర్ట్ ఎంత కామనో.. మరక కూడా అంతే కామన్. తిట్టేవారు మాత్రం మారారు. అప్పుడు అమ్మ.. ఇప్పుడు ఆవిడ! మరి మనం ఎందుకు మారలేదు? ఎందుకంటే మనకు మరకంటే పరమ చిరాకు. చిన్నప్పటి నుంచి మరక మంచిది కాదు అనే మాటలకు మనం ఎడిక్ట్ అయిపోయి ఇంకా సామాన్యులుగా బతికేస్తున్నాం. మనలాగే సర్ఫ్‌ఎక్సెల్ వాళ్లు కూడా భయపడితే మార్కెట్‌లో నిలిచేవారా? మరకా మంచిదే అని వాళ్లు ఎప్పుడైతే గ్రహించారో.. అదే నినాదంతో ప్రత్యర్థులను గెలిచారు? కానీ.. మనం ఇంకా మరకకు భయపడే బతుకుతున్నాం. పాజిటివ్ టర్న్ ‘పనికి రాని వెధవ.. పనికి రాని వెధవ’ అంటూ పదింటి వరకు పడుకున్న కొడుకుపై నాన్న ...