Skip to main content

Posts

Showing posts with the label modern sculpture

అచల శిల్పాలు... అద్భుత రూపాలు

ఒక క్రియేటివ్ థాట్.. ఏడుగురు శిల్పులు.. 12 ప్రాంతాలు.. 20 రోజులు.. 3800 కిలో మీటర్లు... శిల్పాల కోసం ఒక సాహస యాత్ర... కర్టసీ.. అచల స్టూడియో.. కన్సెప్ట్.. శివరామాచారి.. కదిలే శిల్పాల మిక్స్ అండ్ మ్యాచ్ కథ ఇది..  అచల అంటే స్థిరమైనది అని అర్ధం. కానీ ఈ శిల్పాలు స్థిరంగా ఒకే ప్రాంతంలో ఉన్నవి కాదు.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదిలిన శిల్పాలు. ఒక ప్రాంతం ప్రత్యేకతలు.. పరిసరాలు.. పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన అద్భుతాలు. భైరవకోన ప్రకృతి సౌరభాలు.. బెంగళూరు అర్బన్ టచ్... బేలూర్ చెన్నకేశవ ఆలయ అందాలు.. సహ్యాద్రి పర్వత సౌందర్యాలు.. మైసూర్ మిత్స్... ఊటీ నేచర్... కన్యాకుమారి కమనీయ దృశ్యాల నుంచి శిల్పులు స్ఫూర్తి పొంది తీర్చిదిద్దిన శిల్పాలివి. మే 12న హైదరాబాద్‌లో బయలు దేరిన అచల స్టూడియో టీమ్ భైరవ కోన నుంచి ఒక యాత్రని ప్రారంభించింది. బేలూర్, వెస్ట్రన్ ఘాట్స్, మైసూర్, ఊటీ, కొచ్చీ, కన్యాకుమారి, పొదుచెర్రీ, మహాబలిపురం, చెన్నై మీదుగా సాగిన ఈ యాత్ర జూన్ 1న తిరిగి హైదరాబాద్‌కి చేరుకుంది. ఆరుగులు శిల్పులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ ఇన్‌స్పైర్ అయిన అంశాల్ని తమ శిల్పాలకు జోడిస్తూ.. 30...