Skip to main content

Posts

Showing posts with the label beereddy

ఆరు నూరవుతుంది.

వన్ ఫైన్ మార్నింగ్.. మినీ ట్యాంక్ బండ్, సరూర్‌నగర్. ‘‘ఏంటంకుల్ అంతలా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి పై కప్పులు ఏ రేకుల్తో వేద్దామా అనా?’’ బెంచీ మీద కూర్చున్న ఒకాయణ్ణి అడిగాడు ఒక కుర్రాడు. ‘‘ఓహ్.. నువ్వా శ్రవణ్? అదీ.. మా ఇంటి పై కప్పుల గురించి కాదు.. మా వాడ్ని ఎలా పైకి తీసుకురావాలా? అని’’ ‘‘అరె... ఏమైందంకుల్ వాడికి?’’ ‘‘ఏముంది.. నువ్వు చూడు మంచి ఉద్యోగం చేస్తున్నావ్. వాడికి నీలా పైకొచ్చేందుకు ఒక్క మంచి లక్షణం లేదు. రాత్రి రెండింటి దాక కంప్యూటర్ ముందు.. పొద్దున పదింటికి లేవడం. కాస్త తెల్లారిగట్లయినా లేచి ఏడ్వరా అంటే.. ‘తెల్లారి గట్ల కోడి కూడా లేస్తది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తినేస్తున్నమ్’ అని సినిమా డైలాగులు చెప్తున్నడు.’’ ‘‘లేదంకుల్ వాడు....’’ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు శ్రవణ్. ‘‘నీ వయసులో ఉన్న శ్రవణ్ చూడు నెలకు 50 వేలు సంపాదిస్తున్నాడు’ అని ‘నీ గురించి చెబితే.. ‘నీ వయసులో ఉన్న బిల్‌గేట్స్ మిలియనేర్ అయ్యాడు. మరి నువ్వు?’ అని కౌంటర్లు ఇస్తున్నాడు’’ ‘‘లేదంకుల్.. వాడి గురించి నాకు తెలుసు.. చూడండి వాడు గొప్ప వాడవుతాడు..’’ ‘‘వాడేం బాగుపడతాడు. వాడ్ని చూసి వాడి ...

మరకా మంచిదే అని వాళ్లు ఎప్పుడైతే గ్రహించారో.. అప్పుడూ...

మరకా మంచిదే... సర్ఫ్ ఎక్సెల్ ఉన్నప్పుడు! ఇదేదో సర్ఫ్ ఎక్సెల్ ప్రమోషన్ అనుకునేరు... కాదు.. మరకలాంటి విమర్శను వాషవుట్ చేసే ప్రయత్నం. అయితే ఇక్కడ ఈ మరకను పోగొట్టడానికి ఏ కంపెనీ వాషింగ్ టానిక్ లేదు. సెల్ఫ్‌చెక్కే దాన్ని సెట్‌రైట్ చేసే డిటర్జంట్. అందుకే విమర్శా మంచిదే. సెల్ఫ్‌చెక్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు. ‘ఏరా షర్ట్ మీద ఈ మరకలేంటి?’ అని అమ్మ చిన్నప్పుడు తిట్టేది. ‘చిన్నపిల్లాడిలా షర్ట్ మీద ఈ మరకలేంటి?’ అని భార్యామణి గొణుగుతోంది. అప్పుడూ ఇప్పుడూ షర్ట్ ఎంత కామనో.. మరక కూడా అంతే కామన్. తిట్టేవారు మాత్రం మారారు. అప్పుడు అమ్మ.. ఇప్పుడు ఆవిడ! మరి మనం ఎందుకు మారలేదు? ఎందుకంటే మనకు మరకంటే పరమ చిరాకు. చిన్నప్పటి నుంచి మరక మంచిది కాదు అనే మాటలకు మనం ఎడిక్ట్ అయిపోయి ఇంకా సామాన్యులుగా బతికేస్తున్నాం. మనలాగే సర్ఫ్‌ఎక్సెల్ వాళ్లు కూడా భయపడితే మార్కెట్‌లో నిలిచేవారా? మరకా మంచిదే అని వాళ్లు ఎప్పుడైతే గ్రహించారో.. అదే నినాదంతో ప్రత్యర్థులను గెలిచారు? కానీ.. మనం ఇంకా మరకకు భయపడే బతుకుతున్నాం. పాజిటివ్ టర్న్ ‘పనికి రాని వెధవ.. పనికి రాని వెధవ’ అంటూ పదింటి వరకు పడుకున్న కొడుకుపై నాన్న ...

ఎవరినైనా ప్రేమిస్తే.. మనసుతో ప్రేమించండి. టైంపాస్ కోసం ప్రేమించకండి..

ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. వినోద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతనితో కొంతకాలం తిరిగాక.. సంతోష్ అనే మరో అబ్బాయికి దగ్గరయ్యింది. తనకు దూరంగా ఉండడం వినోద్‌కి నచ్చలేదు. దీంతో 2010.. ఏప్రిల్ 18.. ఆదివారం.. బేగంపేటలోని లైఫ్‌స్టయిల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు మీది నుంచి తోసేసి.. తానూ దూకాడు వినోద్. ఆ రోజు వినోద్ ప్యాంట్ జేబులో ఒక సూసైడ్‌నోట్ దొరికింది. మై లాస్ట్ డే సూసైడ్ లెటర్ అని మొదలుపెట్టాడు వినోద్. మూడేళ్లుగా నేనూ శ్రీదేవి పేమించుకుంటున్నాం... అయితే కొన్ని నెలలుగా ఆమె నాతో సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయమై అడిగితే సంతోష్ అనే యువకుని పేమిస్తున్నానని చెప్పింది. అది నాకు నచ్చలేదు. తనే జీవితంగా బతుకుతున్న నన్ను కాదని వేరొకర్ని ప్రేమించడం నేను భరించలేకపోయాను. తను నన్ను మోసం చేసింది. నాలా మరో యువకుని జీవితం నాశనం కాకూడదు. అందుకే తనను చంపాలనుకుంటున్నాను. తను లేనిది నేను బతకలేను. అందుకే నేనూ చనిపోతున్నాను... అని రాశాడు. ఎవరినైనా ప్రేమిస్తే.. మనసుతో ప్రేమించండి. టైంపాస్ కోసం ప్రేమించకండి.. అని కూడా రాశాడు. అమ్మానాన్నలకు సారీ చెప్పాడు. ఇప్పటివరకు మీకోసం ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి.. అని రాశాడు.

108 సంఖ్యకి ఎందుకంత ప్రాముఖ్యం?

108 సంఖ్య ప్రాచీన భారతీయులకు చాలా పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యత నిచ్చారు. దేవున్ని / దేవతలను మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేసేవారు. 108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులువంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం. వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో.. భూమికి, చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. భూమికి, సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని..  సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అనీ నిర్థారించారు. ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికీ, చంద్రునికీ, చంద్రునికీ సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది. ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలను గుర్తించింది. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి జీవచైతన్యం మానవ శరీరంలో...

ఈ చెట్టు ఊరికిపోయింది తెల్సా!

ఈ చెట్టు ఊరికిపోయింది తెలుసా? మొన్నటి వరకు ఇది చౌటుప్పల్‌ దగ్గర ఉండేది. ఇప్పుడు చిట్యాలకు వెళ్తుంటే రైల్వే బ్రిడ్జీ దగ్గర కుడివైపు ఉంటోంది. చెట్టు ఊరికి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా? చెట్లకు చక్రాలుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో. రోడ్ల వెడల్పు పెంచినప్పుడల్లా ఎంచక్కా అవి అవతలివైపు కెళ్లి నిలబడి ఉండేవి. చక్రాలు లేవు కదా చక్రాలున్న వాహనాలు హాయిగా తిరగడం కోసం వాటిని నిలువునా నరికి చంపడమూ న్యాయం కాదు. అందుకే ఈ మధ్య వాటిని సగం సరికి మరోచోట పాతి సగమూ బతికేలా చేస్తున్నారు. ఎవరో కోర్టుకెళ్లి ఆర్డరు తెచ్చుకునేదాకా ఆగకుండా ప్రతి రోడ్డు విస్తరణలోనూ ఈ పద్ధతిని భాగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా దేని గురించి అంటారా? తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ గురించి. రోడ్డుకు ఇరువైపునున్న తొమ్మిది వేల చెట్లలో కేవలం 36 చెట్లని మాత్రమే తీసి వేరే చోట నాటారు. బతికాయా? ఎలా ఉన్నాయి అంటారా? మీరే చదవండి.  అ శోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను. పాదచారులు ఆ చెట్ల నీడలో సేదతీరెడివారు- అని చిన్నప్పుడు బట్టీ పట్టిన పాఠం మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు చూస్తున్నప్పుడు....

ద్రాక్ష తోటలో ఒక రోజు

కీసర దగ్గరలోని ఒక ద్రాక్ష తోటకు నిన్న ఆదివారం ఒక పార్టీకి  వెళ్ళాము. ఆ ఫొటోలే ఇవి.  హ... హ.. హ.. ఆదినారాయణ మల్లెంపుటి, శ్రీధర్ దాసరి. మీట్.. ఈట్..  చిట్ చాట్  ద్రాక్ష గుత్తి..  ఆది.. ఆట   తోటలో ఇల్లు.. గొర్రెల కాపరి.  కాలువ దాటాలంటే ఈ వంతెన మీంచే...  బావి దగ్గర నీటికుంట బోరు నీళ్ళతో ఆడుతున్న అంకిత్  పాలకూర తోట  పచ్చని పొలంలో..   ట్రీ రెస్టారెంట్  సి వి ఎల్ ఎన్, బల్లెడ, అక్బర్   బ్యాక్ టు పెవిలియన్   పిల్ల కాలువ..  మేం తిరిగి వచ్చేప్పుడు ఆ బావి దగ్గర స్నానం చేయడానికి వచ్చారు వీళ్ళు.. 

నడవలేడు.. నడిపిస్తున్నాడు...

డాన్ బాస్కో రిహాబిలిటేషన్ సెంటర్, రామంతాపూర్, హైదరాబాద్ వికలాంగుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.  ఒక వికలాంగుడు కన్నీరు పెడుతూ పాట పాడుతున్నాడు.. వింటున్న వారిలోంచి ఒకాయన లేచి.. ‘‘ఆపండి.. ఏడిపించే ఇలాంటి పాటలొద్దు. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం. ఇక చాలు. వికలాంగుల్లో ధైర్యం పెంచే పాటలు పాడండి. ఆశ నింపే మాటలు చెప్పండి. జై వికలాంగ్’’ అని కష్టంగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్. వికలాంగులకు నాయకుడు.  నెల రోజుల తర్వాత.. ఎన్‌పిడిఓ కార్యాలయం, మలక్‌పేట ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్‌ని కలిసేందుకు వచ్చారు. తాము తీయబోతున్న డాక్యుమెంటరీ కోసం ఒక వికలాంగ బాలుడు కావాలని అడిగారు. కథేంటని అడిగారు శ్రీనివాస్. వచ్చిన వారు క్లుప్తంగా చెప్పారు. ‘‘బావుంది. నథింగ్ ఎబౌట్ అజ్ వితౌట్ అజ్.. మేం లేనిదే మా గురించి వద్దు.. మమ్మిల్ని పనికిరాని వాళ్లుగా కాదు.. మేమూ సాధించగలమని చూపించండి’’ అన్నారు శ్రీనివాస్. ఈ రెండు సంఘటనలు చాలాఉ ఆయనేంటో చెప్పడానికి, ఏనుగమ్మ ఏనుగు అని భుజాల మీద ఆడించిన తండ్రి తన కొడుకు నడవలేడని తెలిసి ఆ రోజు బాధపడి ఉంటారు. కానీ ఈ రోజు ‘‘నా కొడుకు వికలాంగు...

జై బోలో తెలంగాణా.. మొదటి రోజు మొదటి ఆట