Skip to main content

Posts

Showing posts with the label mv ramanareddy

అన్నమయ్య కీర్తనలకు... ఘంటసాల గాత్రానికి.. ఈలతో కొత్త జీవం

ఈలకు.. స్వరాలు అద్ది.. శృతిలయలు కలిపి.. గమకాలు పలికించి..  ఈలపాటా ఒక పాటే అని నిరూపించాడు.  అన్నమయ్య కీర్తనలకు... ఘంటసాల గాత్రానికి..  తన ఈలతో కొత్త జీవం పోశాడు.  అలాంటి విజిల్ మ్యాస్ట్రో రమణతో ములాఖాత్ ఇది.  రూపాయి బిళ్ల గాల్లోకి ఎగిరింది. నేలకు సమాంతరంగా చాపిన అరచేతిలో పడింది. ఇంకో చేత్తో దాన్ని మూసేశాడు రమణ. తెరిచి చూడాలంటే భయం. బొమ్మా బొరుసా? లబ్ డబ్.. లబ్ డబ్.. చేతుల మధ్య బిళ్ల కూడా ఎగురుతోంది. బొమ్మయితే బీఏ.. బొరుసయితే ఎమ్మెస్సీ. అదేంటి ఎమ్మెస్సీ చదవాలంటే బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి కదా?! ఎంబీబీఎస్ చదివి.. మెడికల్ షాపు పెట్టుకున్నట్లు.. బిఎస్సీ పూర్తయ్యాక మళ్లీ బీఏ చదవడం ఎందుకు? అక్కడే ఉంది ట్విస్ట్. అది అతని జీవితంతో ముడిపడి ఉంది. భవిష్యత్‌ని నిర్ణయించబోతోంది? ఏడాది క్రితం..  సికింవూదాబాద్ పీజీ కాలేజ్.. రమణ అక్కడ బీఎస్సీ చదువుతున్నాడు.  ‘రేయ్.. ఎస్‌పీ కాలేజ్‌లో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. నువ్వు తప్పకుండా పాల్గొనాలి’ అన్నాడు స్నేహితుడు.  ‘లేదు.. అది పెద్ద కాలేజ్. చాలామంది వస్తారు. నేను పాల్గొనను’ అన్నాడు రమణ.  ‘అదేంటి అలా అంటావ్...