Skip to main content

Posts

Showing posts with the label second bhadradri

శ్రీరామనవమి శుభాకాంక్షలు... రామాలయం బ్లాగు ప్రారంభం..

శ్రీరామనవమి పర్వదినాన.. రామాలయం బ్లాగు ప్రారంభమైంది. నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న రామాలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. దీనికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. మొదట ఈ దేవాలయం పట్టణంలోని మాల్‌బౌళి సమీపంలో ఉండేది. కొంతకాలం అనంతరం ఈ ప్రాంతంలో అనాచారాలు, దుష్కర్మలు జరగడంతో శ్రీ స్వామి వారు శ్రీ కంభంమెట్టు శేషాచార్యుల అన్నదమ్ములకు కలలో కనిపించి నన్ను వేరే ఎక్కడైనా ప్రతిష్టించాలని కోరుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఒక మంచి ముహుర్తం చూసుకుని నల్గొండ సమీపంలోని పానగల్లు గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో గరుడ పక్షి వచ్చి శకునంగా వాలి భూమికి ముక్కు తుడిచి వెళ్లిందని, అప్పుడు వారు ఈ పక్షి దష్టాంతరం తెలుసుకునేందుకు కొందరు వ్యక్తులను తీసుకెళ్లి గడ్డపారలతో తవ్వగా ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న దేవాలయానికి కావాల్సిన రాయి, తదితర వస్తువులు దొరకడంతో సుమారు 200 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న, హన్మంత సమేతంగా ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి రామగిరి అనే నామకరణం చేశారు. మొదట్లో ఈ దేవాలయంలో గర్భగుడి మాత్రమ...