Skip to main content

Posts

Showing posts with the label paravastu lokeshwar

స్టాల్ నెంబర్ 91 మాత్రం ప్రత్యేకమైనది ఎందుకో ?

,డిసెంబర్ 24...మధ్యాహ్నం 12.30.. హైదరాబాద్ బుక్ ఫెయిర్, నెక్లెస్ రోడ్.. గేటుకు ఎదురుగా చాలా పుస్తకాల స్టాల్స్ ఉన్నాయి. ప్రతిదాంట్లో చాలామంది రచయితల పుస్తకాలు.. రకరకాల అంశాల మీద రాసినవి కనిపిస్తాయి. కానీ ఎడమవైపు రెండోది మాత్రం అక్కడ ప్రత్యేకమైనది. ఎందుకో మీరే చదవండి. స్టాల్ నెంబర్ 91.. గాంధీ ప్రచురణలు.. సలామ్ హైదరాబాద్, చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర, ఒక హిజ్రా కథ, 1948 సెప్టెంబర్ 17 జ్ఞాపకాలు గాయాలు, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు.. ఇలా చాలా పుస్తకాలు ఆ స్టాల్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ రాసింది ఒక్కరే.. ఆయనే పరవస్తు లోకేశ్వర్. 250కి పైగా స్టాల్స్ ఉన్న ఆ పుస్తక ప్రదర్శనలో ఒక రచయిత ఏర్పాటు చేసిన స్టాల్ మాత్రం అదొక్కటే. ‘వట్టికోట’ వారసత్వం... తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు తీసి ప్రాణం పోసిన వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తితో ఈ స్టాల్‌ని ఏర్పాటు చేశానని చెప్పారు లోకేశ్వర్. నిజాంను గడగడలాడించిన ‘ఆంవూధమహాసభ’ నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా, గ్రంథాలయోద్యమ సారథిగా వట్టికోట సుపరిచితులు. 1923లో ఆయన గ్రామ గ్రామనికి వెళ్లి పుస్తకాలు అమ్మేవాడు. ప...