Skip to main content

Posts

Showing posts with the label about google doodles

క్రియేటివిటీ, ఇన్నోవేషన్ + ఫన్... ఇదీ గూగుల్ డూడుల్ స్టయిల్.

గూగుల్ డాట్ కామ్ హోమ్‌పేజీలో google అనే రంగు రంగుల అక్షరాలు ఒక్కోసారి ఒక్కోరకంగా కనిపిస్తుంటాయి. పండగలు, ఉత్సవాలు, ప్రముఖుల పుట్టిన రోజులు.. ఇలా సందర్భాన్ని బట్టి వాటికి అనుగుణంగా అక్షరాలను మారుస్తుంది google. వాటినే డూడుల్స్ అంటారు. దీనికి గూగుల్ ఇచ్చిన తెలుగు అనువాదం ‘మనసును ఎక్కడో పెట్టుకుని గీతలతో గెలికే చిత్రం’ అని. కానీ గూగుల్ మనసు ఎక్కడో పెట్టుకుని గీయదు. దాన్ని సృష్టించడానికి పక్కా ప్లాన్ ఉంది. వండర్‌ఫుల్ టీమ్ ఉంది. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ + ఫన్... ఇదీ గూగుల్ డూడుల్ స్టయిల్. అందుకే డూడుల్ ఇప్పుడొక మానియా అయ్యింది. గూగుల్ వ్యవస్థాపకులలో ఒకరైన సెర్జీ బ్రిన్ 199లో గూగుల్ లోగోని డిజైన్ చేశాడు. గింప్ అనే గ్రాఫిక్ ప్రోగ్రామ్ ఆధారంగా ఈ లోగో తయారు చేశాడు. దీని చివరలో ఆశ్చర్యార్థకం ఉండేది. ఇది అచ్చం యాహూ లోగో మాదిరిగానే ఉందన్న విమర్శలొచ్చాయి. రెండేళ్ల తర్వాత చీఫ్ డిజైనర్ రూత్ కేడర్ మరో కొత్త లోగోని సృష్టించాడు. ఇప్పుడున్న లోగోని డిజైన్ చేసింది ఆయనే. సాధారణంగా ఒకే రంగు అక్షరాలతో లోగోని డిజైన్ చేస్తుంటారు. గూగుల్ ఆరు అక్షరాల్లో నాలుగు రంగులు కనిపిస్తాయి. వాడితే అన్నీ ...