Skip to main content

Posts

Showing posts with the label karate master

ఎవరికీ తెలియని సెవెంత్ సెన్స్ సంపత్ జీవితం

face is the index of mind (వ్యక్తి మొఖాన్ని చూసి మనస్తత్వం చెప్పొచ్చు) never judge a book by its cover (ముఖ చిత్రాన్ని చూసి పుస్తకం ఎలా ఉందో చెప్పలేం) ఈ రెండు మాటలు ఒకదానికొకటి చాలా భిన్నమైనవి. కానీ ఈయన విషయంలో ఈ మాటలే విభిన్నమైనవి. ఈయన్ని చూసి వయస్సు చెప్పలేం. ఈయన రాసిన పుస్తకాల్ని చూసి అందులో ఏముందో చెప్పొచ్చు. కై్వట్ కాంట్రాస్ట్. అలాంటి వ్యక్తి ములాఖత్ ఇది. ఉపాధ్యాయుడు పాఠం చెప్పి.. పరీక్ష పెడతాడు. జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. అందుకే జీవితం.. ఒక పోరాటం. ఇదో నానుడి. పోరాటాలే జీవితం.. ఇది ‘నా’ నుంచి.. ఇక్కడ నా అంటే.. ఎస్. సంపత్‌కుమార్. ఆయన రాసిన మార్షల్ ఆర్ట్స్ పుస్తకం మనోగతంలో ఇలా రాసుకున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః ఎక్కడయితే ధర్మానికి బాధకల్గుతుందో అక్కడ యుద్ధానికి అంకురం పడుతుంది. కానీ.. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయాలి. మనిషి మనుగడకోసం.. పోరాటం చేయాలి. ఇదిప్పుడు ఒక ఆరాటం కాదు.. అవసరం.. అలా కుస్తీతో మొదలైంది సంపత్‌కుమార్ జీవితం. 1974లో ఒకరోజు.. ‘‘మరుభూమిలో మడుమల్ తాకులాడగా.. నిజాముకు ముచ్చెమటలు పట్టించిన మురిళీ కొడ...