Skip to main content

Posts

Showing posts with the label navya

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లండన్ నుంచి ఢిల్లీకి రోడ్డు ప్రయాణం చేసిన దంపతులు

పెంపుడు జంతువుల సంరక్షణ కోసం నిధులు సేకరించేందుకు ఒక జంట లండన్ నుంచి ఢిల్లీ వరకు రోడ్డు ప్రయాణం చేశారు. 15 దేశాల మీదుగా ఎంతో కష్టమైన ఈ పనిని 51 రోజుల్లో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. ఆ దంపతులే ఢిల్లీకి చెందిన పూజా, తుషార్. ప్రస్తుతం వీరు లండన్లో నివసిస్తున్నారు. వీరు సాహసయాత్ర పూర్తయిన తర్వాత నేను ఆంధ్రజ్యోతి నవ్యలో 12.8.2010లో వారి ఈమెయిల్ ఇంటర్వ్యూ రాశాను. (ఆ వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ఫోటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ) తాజాగా వారికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చినట్లు ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఆ రికార్డు ఇక్కడ .