Skip to main content

Posts

Showing posts with the label varila kalaganandi.. varila jeevinchandi

'వారిలా కలగనండి.. వారిలా సాధించండి'

ఇంగ్లీషులో జనాదరణ పొంది, ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమైన 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌'కి తెలుగు అనువాదం ఈ పుస్తకం. నలుగురు నడిచే దారిలో మనం నడిస్తే థ్రిల్‌ ఏముంటుంది? మనమే ఓ కొత్త మార్గాన్ని కనిపెడితేనే ఉంటుంది మజా. కానీ ఆ కొత్తబాటలో ఎన్నో ముళ్లుంటాయి. రాళ్లు రప్పలుంటాయి. ఎత్తుపల్లాలుంటాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌లో చదివి తమ భవిష్యత్తుకు అలా బంగారుబాటలు వేసుకున్న 25 మంది వ్యాపారవేత్తల విజయగాథల్ని ఈ పుస్తకంలో వివరించారు రచయిత్రి. 'వ్యాపార రంగంలో ఎదగాలని ఎంతోమందికి ఉంటుంది. ఒకవేళ అలా జరిగివుంటే నేను కోటీశ్వరున్ని అయిఉండేవాడ్ని.. ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈపాటికి కంపెనీ పెట్టి ఉండేవాడ్ని.. ఇలా మనం చాలాసార్లు అనుకుంటుంటాం. ఈ 'ఒకవేళలు' మనం కనే పగటి కలలు కావు. అవి మన ఆశలు, ఆకాంక్షలు, మన స్వప్నాలు. మనం 'ఏదో ఒకరోజు' అనే పెట్టెలో వీటిని భద్రంగా మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువునీ, తర్కాన్నీ కలరా ఉండల్లా వాటి పక్కనబెట్టి భద్రంగా ఉంచుతాం. ఆ తర్వాత దాన్ని మరిచిపోయినవాళ్లు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను ఎవరు చేజిక్కించుకు...