Skip to main content

Posts

Showing posts with the label osmania university

గుర్తుపట్టండ్రా.. ఎవరో ఒకరు!

పూర్వవిద్యార్థుల సమావేశం ఇప్పుడు చాలామంది జరుపుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఈ కాలేజీకి కాస్త ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ రజతోత్సవాల సందర్భంగా కర్నూలులో ప్రారంభమైన డిగ్రీ కాలేజ్‌ ఇది. దాని పేరే 'సిల్వర్‌ జూబ్లీ కాలేజ్‌'. ఈ కాలేజ్‌ పూర్వ విద్యార్థులు పన్నెండేళ్లుగా ప్రతి ఏడాది గాంధీ జయంతి సందర్భంగా కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా కలిశారు. ఆ సన్నివేశమే ఇది. --- అక్టోబర్‌ 2, ఉదయం 10 గంటలు... ఠాగూర్‌ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్శిటీ ఎడమవైపు గోడకు కట్టిన బ్యానర్‌పై Welcome to J. Raymond Peter, IAS Principal Secretary, Social Welfare Department - Silver Jubilee College Fraternity అని రాసి ఉంది. "అసలు ఈ ఫంక్షన్‌కి ముందు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారిని అనుకున్నారట. ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో రేమండ్‌ గారిని గెస్ట్‌గా పిలిచారట'' ఆ గుంపులో ఎవరో అంటున్నారు. ఊ ఊ ఊ కుడివైపు కౌంటర్‌పై 'రిజిస్ట్రేషన్‌ ఫీజు : 150 రూపాయలు' అని రాసి ఉంది. కౌంటర్‌ చుట్టూ జనాలు గుమికూడారు. "ఈ రిజిస్ట్రేషన్‌ దేనికిరా?'' ఫామ్‌ నింపుతూ అడిగాడు ఒకాయన. "ఎంతమంది...