మీ కంప్యూటర్‌లో ముఖ్యమైన ఫైల్ డిలీట్ అయిపోయింది.. ఏం చేస్తారు? మెమరీ కార్డ్‌లోంచి డిలీట్ చేసిన ఫోటోల్ని రికవరీ చేయొచ్చా? ఫార్మాట్ చేసిన పెన్‌డ్రైవ్‌లోని వీడియోల్ని తిరిగి పొందొచ్చా? డోంట్ వర్రీ వీటన్నింటికీ పరిష్కారం ఉంది. రీసైకిల్ బిన్‌లోంచి ఎగిరిపోయిన ఫైల్స్‌ని కూడా వెతికి పట్టుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని టూల్స్ గురించి తెలుసుకోండి. మీ కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లో ఒక ఫైల్ కనిపించకుండా పోయిందంటే ఇక అది దొరకనట్లే కాదు. మీ హార్డ్ డిస్క్ పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రమే దాన్ని తిరిగిపొందడం కుదరదు. కానీ ఈ మధ్య వస్తున్న హార్డ్ డ్రైవ్‌లు అంత త్వరగా పాడైపోయేవి కావు. అందుకే మీరు కోల్పోయిన డేటాని తిరిగిపొందడం పెద్ద కష్టమేం కాదు. మీ కంప్యూటర్‌లో ఒక ఫైల్‌ని డిలీట్ చేస్తే అది డైరెక్టరీ నుంచి మారుతుందే తప్ప పూర్తిగా కంప్యూటర్‌లో లేకుండా వెళ్లిపోదు. మరెక్కడికి పోతుంది.. సింపుల్.. రీసైకిల్ బిన్‌లోకి. అక్కడ కూడా డిలీట్ చేస్తే? Shift + Delete నొక్కితే? యస్.. అప్పుడు కూడా ఫైల్‌ని రికవరీ చేసుకునే వీలుంది. పెయిడ్ సర్వీసెస్ మీ ఫైల్ డిలీట్ అవ్వగానే... అంటే రీసైకిల్ బిన్ నుంచి కూడా ...