Skip to main content

Posts

Showing posts with the label future internet

జస్ట్.. ఒక్క నిమిషంలో ఏం జరుగుతోంది?

కంప్యూటర్ ఆన్‌లో ఉంది.  అది ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయి ఉంది.  ఒక ఈ-మెయిల్ పంపించడానికి ఎంత సమయం పడుతుంది?  జస్ట్.. ఒక్క నిమిషం! ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేయడానికి.. ట్విట్టర్‌లో ట్వీట్ కొట్టడానికి??? అంతే సమయం.. అదే నిమిషం..  అంటే.. కేవలం 60 క్షణాలు... ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? లెక్కల మాస్టారు పాఠం చెప్పినట్లు అంకెలు కాస్త ఎక్కువగా ఉంటాయి, కంగారు పడకండి. ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారు. అందులో ఆసియాకి చెందినవారు 44.8 శాతం మంది ఉన్నారు. సుమారు సగం వాడకందారులు మన ఖండంలోనే ఉన్నారన్నమాట. ఇందులో చైనా వాటా 50 శాతం. 12 శాతంతో మన దేశం రెండో స్థానంలో ఉంది. అంటే భారతదేశ జనాభాలో 10 శాతం మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారన్నమాట. ‘వెబ్’ దునియా: ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల వెబ్‌సైట్లు ఉన్నాయి. 2011లోనే 30 కోట్ల వెబ్‌సైట్లు కొత్తగా చేరాయి. ప్రతి ఒక్క నిమిషంలో 570 కొత్త వెబ్‌సైట్‌లు రిజిస్టర్ అవుతున్నాయి. ‘సోషల్’యిజం: ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్క నిమిషానికి 6,95,000 స్టేటస్‌లు అప్‌డేట్ అవుతున్నాయి. 2,77,000 మంది బుక్(లాగిన్...