Skip to main content

Posts

Showing posts with the label sri ramadaasu

శ్రీ జావదాసు

పారే సెలయేళ్లు.. పచ్చిక బయళ్లు.. ఏటి గట్టు.. ఈత చెట్టు.. ఇవన్నీ తన మరదలుతో ‘‘ఏలే.. ఏలే.. మరదలా’’ అని పాడుకుంటూ తిరిగేవాడు చంద్రన్న. చెట్టంత కొడుకు చెట్టు పుట్టల వెంట కాలీపీలీ తిరగడం ఇష్టం లేదు వాళ్ల డాడీకి. అందుకే సిటీకి పంపిద్దామని ప్లాన్ గీసిండు. పండక్కి వచ్చిన వాళ్ల మామతోని హైదరాబాద్‌కి పంపిండు. అలా మామతో సిటీ బాటబట్టిండు చంద్రన్న. బస్సు బయలుదేరింది. పట్నం దగ్గరికొచ్చింది. దుర్గం చెరువులో చిన్న పడవ బయలుదేరింది. బ్యాగ్రౌండ్‌లో ఓ సాంగు.. ఓలెస్సా.. ఓలే ఓలెస్సా.. ఎటయ్యిందె దుర్గం చెర్వు.. ఎందుకీ కులికి పాటు గగరు పాటు ఎవరో వస్తున్నట్టు.. ఎదురు చూస్తున్నది ఇంటర్‌నెట్టు.. నీ మీదొట్టు.. నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు.. మన కంప్యూటర్ సామికి మంచి గడియ రాబోతున్నట్లు... చంద్రన్నని ఆ మామయ్య తీసుకెళ్లి ఓ పెద్ద కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో జావా కోర్సులో చేర్పించిండు. ఆ కంపెనీలో అన్నీ కంప్యూటర్లే. అవి జనాలకు చేస్తున్న మేలును చూసి ఫ్లాటయ్యిండు చంద్రన్న. అంతా కంప్యూటరుమయం...ఈ జగమంతా కంప్యూటరుమయం.. ’’ అని పాడుకుండు. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. కంప్యూటరు కళ్లల...