యూట్యూబ్ సెర్చ్‌లో ‘జిస్మ్ 2’ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. పేజీకి 23 వీడియోలు కనిపిస్తాయి. అలా 50 పేజీలు. అంటే 1,150 వీడియోలు. ఒక్కో వీడియోని సుమారు 500 మందికి పైగా చూశారు. కొన్నింటిని లక్ష మందికి పైనే చూశారు. అంటే మొత్తంగా కోట్లాది మంది ఆ వీడియోల్ని చూశారు.. చూస్తున్నారన్నమాట. ‘జిస్మ్’ అంటే దేహం. ఒక దేహం గురించి కోట్ల మంది వెతుకుతున్నారంటే, ఆరాధిస్తున్నారంటే ఆమె ఒక దేవత అయి ఉండాలి. అవును..ఆమె ఒక దేవత. లక్షల కోట్ల మంది మౌనంగా, రహస్యంగా, మనసులో, చీకట్లో ఆమె (దేహాన్ని)ని ఆరాధిస్తున్నారు. ఆమె పేరు సన్నీ లియోన్. ఆమె వెబ్‌సైట్‌లోని వీడియోల్లో ‘సన్నీ లియోన్.. ది గాడెస్’ అనే టైటిల్ కార్డే ఇందుకు ‘బ్లూ’ విట్‌నెస్. 2003లో ‘జిస్మ్’ సినిమా విడుదలైంది. దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మించారు. అమిత్ సక్సెనా దర్శకత్వం వహించారు. 1944లో ‘బిల్లీ విల్డర్స్’ తీసిన హాలీవుడ్ మూవీ ‘డబుల్ ఇన్‌డెమ్నిటీ’ని జిస్మ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని ‘హాట్’ సీన్లని అమిత్ చూపించాడు. జాన్ అబ్రహాం, బిపాసా బసు అద్భుతంగ...