Skip to main content

Posts

Showing posts with the label tech knowledge

జస్ట్ ఎండలో పెడితే ‘ఎనర్జీ’నిచ్చే టెక్నాలజీని ఉపయోగించుకోండి.

సీటీలో రోజుకు మూడు గంటల కరెంటు కోత.. గ్రామాల్లో పన్నెండు గంటలు... విద్యుత్‌తో అవసరం లేని లోకాన్ని.. ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించండి. రెండు రోజులు వాన కురిసినా.. రెండు రోజులు ఎండ అంతో ఇంతో కొడుతూనే ఉంది. అందుకే.. జస్ట్ ఎండలో పెడితే ‘ఎనర్జీ’నిచ్చే టెక్నాలజీని ఉపయోగించుకోండి.  ఐఫోన్ ఛార్జర్  ఐఫోన్ల కోసం చాలా రకాల సోలార్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఐఫోన్ 4 కోసం ఉపయోగించే ఛార్జర్. దీన్ని 20 నిమిషాలు సూర్యరశ్మి తగిలే చోట పెడితే 5 నిమిషాల టాక్‌టైమ్‌ని, ఒక గంట స్టాండ్‌బై టైమ్‌ని ఇస్తుంది. దీని రెండు వేల రూపాయలకు పైనే ఉంటుంది.  స్యామ్‌సంగ్ బ్లూ ఎర్త్  స్యామ్‌సంగ్ కంపెనీ మూడేళ్ల క్రితమే రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఫోన్ ఇది. దీని వెనకాల ఉండే సోలార్ ప్యానెల్స్‌తో ఇది రీఛార్జ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఉండే మైనస్ ఏంటంటే.. ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే ఈ సోలార్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్‌లో ఉండే మిగిలిన ఫీచర్లను వాడడం కోసం... అంటే ఫోటోలు, వీడియోలు తీయడం లాంటి వాటికోసం ఈ పవర్ ఉపయోగపడదు. భవిష్యత్తులో పూర్తిగా సోలార్ టెక్నాలజీతో పనిచేసే ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి....

నో వైర్స్(only wireless)

ఇంట్లో చాలా వైర్లు ఉంటాయి.. కరెంటు వైర్లు.. టీవీ కేబుల్ వైరు... టెలిఫోన్ వైరు.. ఇంటర్‌నెట్ వైరు.. ఇలా చాలా. కరెంటు వైర్లని ఇళ్లు కట్టుకునేప్పుడు గోడ లోపల ఫిక్స్ చేస్తాం. స్టార్ టీవీ వైర్‌ని కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు కొందరు కంప్యూటర్ లేకున్నా ముందుగానే ఇంటర్‌నెట్ కేబుల్ వైర్‌ని గోడలో ఫిక్స్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో కంప్యూటర్ కొంటే వైరు కనిపించకూడదని. వైర్లు ఎక్కువగా కనిపిస్తే ఇంటీరియర్ దెబ్బతింటుంది. మరి కంప్యూటర్‌కి చాలా రకాల వైర్లు ఉంటాయి. కొన్ని కాళ్లకు తగులుతుంటాయి. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేందుకే ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది.  మార్కెట్‌లో చాలా రకాల వైర్‌లెస్ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. వస్తువుల అసలు ధర కంటే వీటికోసం మరి కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఆ ఖర్చు చేసిన డబ్బుకి ప్రతిఫలం ఉంటుంది. మీ ఇల్లు, ఆఫీసు.. ఒక కంప్యూటర్ సర్వర్ రూమ్‌లా కాకుండా గుడ్ లుక్ ఉండాలంటే ఇలాంటివి వాడండి.  1. మౌస్, కీబోర్డ్ కంప్యూటర్‌కీ మౌస్ నుంచి ఒకవైరు, కీబోర్డ్ నుంచి ఒకవైరు ఉంటుంది. ఇవి లేకుండా ఇప్పుడు వైర్‌లెస్ మౌసూ, కీబోర్డులు లభిస్తున్నాయి. ఏదైనా కంప్యూటర్ షాప్...

మీరు వాడే ఫోన్‌కి ఎలాంటి బ్లూటూత్‌ని ఎంచుకోవాలి?

బ్లూటూత్ ఇప్పుడొక ఫ్యాషన్ యాక్సెసరీ. ఒకప్పుడు బిజినెస్‌మెన్, సెలబ్రిటీలు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో లభించే ఫోన్లలో కూడా బ్లూటూత్ ఆప్షన్ ఉంటోంది. బైక్ నడిపేటప్పుడు, ఎక్కువసేపు ఫోన్లే మాట్లాడేప్పుడు బ్లూటూత్ హెడ్‌సెట్‌ని వాడడం కంఫర్ట్‌గా ఉంటుంది. మీరు వాడే ఫోన్‌కి ఎలాంటి బ్లూటూత్‌ని ఎంచుకోవాలి? పర్ఫెక్ట్ బ్లూటూత్ గురించి తెలిపే గైడ్‌లైన్స్ ఇవి. 1. కాల్ క్వాలిటీ బ్లూటూత్ కొనేముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఇది. ఫోన్‌లో మాట్లాడేప్పుడు వాయిస్ క్లారిటీ ఎంత క్లియర్‌గా ఉందో చూడాలి. ఎదుటివాళ్ల మాటలు మీకు ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయో మాత్రమే కాదు.. మీ మాటలు కూడా ఎదుటివారికి ఎంత క్లియర్‌గా వినిపిస్తున్నాయో కూడా చూడాలి. మీ వాయిస్ మాత్రమే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా ఎక్కువగా రాకుండా చూసుకోవాలి. 2. బ్యాటరీ పవర్ బ్లూటూత్ హెడ్‌సెట్‌కు కూడా ప్రత్యేకమైన ఛార్జర్ ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టి వాడితే రెండు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసే బ్లూటూత్‌లు మార్కెట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫోన్లో ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉ...

మొబైల్ ఫోన్ పోయిందా డోంట్ వర్రీ

గడిచిన కాలం.. వదిలిన బాణం.. ఆడిన మాట.. పోయిందేదీ తిరిగిరాదు.. కానీ సెల్‌ఫోన్.. టాబ్లెట్.. ల్యాప్‌టాప్.. ఇలాంటివి పోతే తిరిగి రాబట్టు కోవచ్చు. పోయిన వాటిని రికవరీ చేసే పోలీసుల్లా పనిచేసే కొన్ని టెక్నికల్ అప్లికేషన్స్ గురించి.. గాడ్జెట్స్ అంటే టెక్ సావీలకు చాలా ఇష్టం. వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి ఇష్టమైన వాటిని సొంతం చేసుకుంటుంటారు. కానీ అవి ఎక్కడైనా పోతే? ఎవరైనా దొంగిలిస్తే? డబ్బుల గురించే కాదు.. అందులో ఉన్న డేటా గురించి కూడా బాధపడాల్సిందే. కాదు.. కాదు.. ఇప్పుడు అంత సీన్ లేదు. ఒకే ఒక్క క్లిక్‌తో దాని ఆచూకీ కనిపెట్టొచ్చు. అదెలాగో చూడండి. మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఆచూకీ కనిపెట్టడానికి అవస్త్ ఫ్రీ మొబైల్ సెక్యూరిటీ (avast free mobile security) ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ ఫెసిలిటీ కేవలం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొబైళ్లలో మాత్రమే ఉంటుంది. అవస్త్ అందించే యాంటీ తెఫ్ట్ సెక్యూరిటీని ఎనేబుల్ చేయగానే ఇన్‌విజిబుల్‌గా అప్లికేషన్ పనిచేస్తుంది. దొంగిలించిన వాళ్లు దీన్ని డిజేసేబుల్ చేయడం సాధ్యం కాదు. పెద్ద సౌండ్‌త...

మీ కంప్యూటర్‌లో ముఖ్యమైన ఫైల్ డిలీట్ అయిపోయింది.. ఏం చేస్తారు?

మీ కంప్యూటర్‌లో ముఖ్యమైన ఫైల్ డిలీట్ అయిపోయింది.. ఏం చేస్తారు? మెమరీ కార్డ్‌లోంచి డిలీట్ చేసిన ఫోటోల్ని రికవరీ చేయొచ్చా? ఫార్మాట్ చేసిన పెన్‌డ్రైవ్‌లోని వీడియోల్ని తిరిగి పొందొచ్చా? డోంట్ వర్రీ వీటన్నింటికీ పరిష్కారం ఉంది. రీసైకిల్ బిన్‌లోంచి ఎగిరిపోయిన ఫైల్స్‌ని కూడా వెతికి పట్టుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని టూల్స్ గురించి తెలుసుకోండి.  మీ కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లో ఒక ఫైల్ కనిపించకుండా పోయిందంటే ఇక అది దొరకనట్లే కాదు. మీ హార్డ్ డిస్క్ పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రమే దాన్ని తిరిగిపొందడం కుదరదు. కానీ ఈ మధ్య వస్తున్న హార్డ్ డ్రైవ్‌లు అంత త్వరగా పాడైపోయేవి కావు. అందుకే మీరు కోల్పోయిన డేటాని తిరిగిపొందడం పెద్ద కష్టమేం కాదు. మీ కంప్యూటర్‌లో ఒక ఫైల్‌ని డిలీట్ చేస్తే అది డైరెక్టరీ నుంచి మారుతుందే తప్ప పూర్తిగా కంప్యూటర్‌లో లేకుండా వెళ్లిపోదు. మరెక్కడికి పోతుంది.. సింపుల్.. రీసైకిల్ బిన్‌లోకి. అక్కడ కూడా డిలీట్ చేస్తే? Shift + Delete నొక్కితే? యస్.. అప్పుడు కూడా ఫైల్‌ని రికవరీ చేసుకునే వీలుంది. పెయిడ్ సర్వీసెస్  మీ ఫైల్ డిలీట్ అవ్వగానే... అంటే రీసైకిల్ బిన్ నుంచి కూడా ...