Skip to main content

Posts

Showing posts with the label e generation

ఆరు నూరవుతుంది.

వన్ ఫైన్ మార్నింగ్.. మినీ ట్యాంక్ బండ్, సరూర్‌నగర్. ‘‘ఏంటంకుల్ అంతలా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి పై కప్పులు ఏ రేకుల్తో వేద్దామా అనా?’’ బెంచీ మీద కూర్చున్న ఒకాయణ్ణి అడిగాడు ఒక కుర్రాడు. ‘‘ఓహ్.. నువ్వా శ్రవణ్? అదీ.. మా ఇంటి పై కప్పుల గురించి కాదు.. మా వాడ్ని ఎలా పైకి తీసుకురావాలా? అని’’ ‘‘అరె... ఏమైందంకుల్ వాడికి?’’ ‘‘ఏముంది.. నువ్వు చూడు మంచి ఉద్యోగం చేస్తున్నావ్. వాడికి నీలా పైకొచ్చేందుకు ఒక్క మంచి లక్షణం లేదు. రాత్రి రెండింటి దాక కంప్యూటర్ ముందు.. పొద్దున పదింటికి లేవడం. కాస్త తెల్లారిగట్లయినా లేచి ఏడ్వరా అంటే.. ‘తెల్లారి గట్ల కోడి కూడా లేస్తది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తినేస్తున్నమ్’ అని సినిమా డైలాగులు చెప్తున్నడు.’’ ‘‘లేదంకుల్ వాడు....’’ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు శ్రవణ్. ‘‘నీ వయసులో ఉన్న శ్రవణ్ చూడు నెలకు 50 వేలు సంపాదిస్తున్నాడు’ అని ‘నీ గురించి చెబితే.. ‘నీ వయసులో ఉన్న బిల్‌గేట్స్ మిలియనేర్ అయ్యాడు. మరి నువ్వు?’ అని కౌంటర్లు ఇస్తున్నాడు’’ ‘‘లేదంకుల్.. వాడి గురించి నాకు తెలుసు.. చూడండి వాడు గొప్ప వాడవుతాడు..’’ ‘‘వాడేం బాగుపడతాడు. వాడ్ని చూసి వాడి ...