Skip to main content

Posts

Showing posts with the label future news

2070లో ఒకరోజు..

కరణ్ అప్పుడే నిద్రలేచాడు. మెయిడ్ రోబో (పని మనిషి) కాఫీ తెచ్చి ఇచ్చింది. ఇంటి గోడలో ఇన్‌బిల్ట్ అయిన టీవీ ఆటోమెటిగ్గా ఆన్ అయింది. టీవీ 149.. అన్నాడు. టీవీలోని వాయిస్ రికగ్నైజేషన్‌తో టీవీ ఛానెల్ మారింది. ‘‘ఈ రోజు ఉష్ణోగ్రత 55 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు. రేడియేషన్ ఒక యూనిట్‌కి నానో గ్రే పర్ ఆవర్స్‌గా ఉంది. సేఫ్టీ గార్డ్స్ లేకుండా ఎవరూ బయటికి రావొద్దు..’ టీవీలో వార్తలొస్తున్నాయి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం ఆ రోజు రాత్రి.. మైండ్‌లోని ఆలోచనలన్నీ ఆన్‌లైన్ పర్సనల్ క్లౌడ్ స్టోరేజీలో దాచిపెట్టుకున్నాడు కరణ్. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. అందుకే ‘ఈ రోజు షెడ్యూల్ ఎంటీ?’ అని మనసులో అనుకున్నాడు. పర్సనల్ ఇంటరాక్షన్ డెస్క్‌టాప్ సిస్టమ్‌లో మైండ్ రీడర్ సాఫ్ట్‌వేర్ ఆన్ అయింది. క్లౌడ్ స్టోరేజీ నుంచి కరణ్ మెమరీని బ్యాకప్ తీసుకుని.. లి-ఫై ద్వారా కరణ్‌తో కనెక్ట్ అయి అతని మెమరీని అప్‌గ్రేడ్ చేసింది సిస్టమ్. ఆ తర్వాత కరణ్ రోటీన్ డైలీ షెడ్యూల్ మొదలైంది. ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ కాదు. ఆన్‌లైన్‌లో కనిపించే కొన్ని హారబుల్ ఫ్యాక్ట్ ఆధారంగా అల్లిన ఒక ఊహ. ఇప...