Skip to main content

Posts

Showing posts with the label hyderabad morning life

ఎవ్రీ మార్నింగ్ is బ్యూటిఫూల్

అదేంటో!?   రోజూ చూస్తూనే ఉన్నా.. ప్రతి సూర్యోదయమూ... కొత్తగానే ఉంటుంది... దానికి ముందు జీవితం వింతగానే ఉంటుంది... అలా ఎన్నో సూర్యోదయాలు  కాలం అంతరంగంలో కలిసిపోతూనే ఉంటాయి... వాటిని తీసి చూడలేం... అలాంటి ఓ సూర్యోదయం గురించి..  ఈ మిక్స్ అండ్ మ్యాచ్. సెల్‌ఫోన్ అలారం మోగే సమయం..  కోడి కూతకు బదులు వాహనాల హారన్‌లు, ఫ్యాక్టరీల సైరన్‌లు ఈ టైమ్‌లో సహజం.. అద్దె ఇళ్లల్లో ఉండేవారు నిద్రలేచి టూ వీలర్ బయటపెట్టి మళ్లీ పడుకునే సందర్భం.. ఒక ఇల్లాలు.. గడప ముందు సిమెంటు నేలని ఊడ్చి, గేటు ముందు సీసీ రోడ్డు మీద నీళ్లు చల్లి చాక్‌పీస్‌తో ముగ్గు వేస్తుంది.స్కూలు పిల్లలు అయిష్టంగానే ట్యూషన్‌కి బయలుదేరుతుంటారు. కాలేజీ విద్యార్థులు ఆలస్యమైపోతోందని హడావిడిగా ప్రయివేటు క్లాస్ బాట పడతారు. కొందరు స్పోర్ట్స్ సూటు, రన్నింగ్ షూస్ వేసుకుని కనిపిస్తారు. చకచకా సైకిల్ తొక్కుతూ పేపర్ బోయ్‌లు వేగంగా వెళ్తుంటారు. టీస్టాల్‌లో పాలు మరుగుతుంటాయి. ఇరానీ ఛాయ్ ఘుమఘుమలాడుతుంటుంది. ఇడ్లీ బండి నడిపేవాళ్లు బండి తోసుకుంటూ అడ్డా మీదికి బయలుదేరుతుంటారు. ఫ్లోరోసెంట్ గీతలున్న నారింజ రంగు ఆప్రాన్ ధరించి మున్సిపాలిట...