అబ్బ.. ఏం కాంబినేషనబ్బ ఇది? వింటేనే నోట్లో ఊరీలొస్తున్నాయి! చెరువులో నీళ్లుండి.. చేతినిండా పని ఉన్న రోజుల్లో.. చేను ఒడ్డుపై కూర్చుని రొయ్యల కూర తింటుంటే.. ఆ రుచుల ఘుమఘుమలు కిలోమీటర్ దాకా వెళ్లేవంట! చాలారోజుల తర్వాత చెరువుల్లో నీళ్లొచ్చాయి.. చేపలు.. రొయ్యల పెంపకానికి మంచిరోజులొచ్చాయి! తెలంగాణ నాటుదనపు ఘాటు వంటకమైన ఈ రొయ్యల వెరైటీలను మనమూ రుచి చూస్తే.. ఆ మజాయే వేరప్పా.! అరిటాకు రొయ్యలు కావాల్సినవి : రొయ్యలు : 200 గ్రా, కారం : ఒక టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, అరటి ఆకు : ఒకటి, కొత్తిమీర : ఒక కట్ట, పుదీనా : ఒక కట్ట, నూనె, ఉప్పు : తగినంత తయారీ : ముందుగా రొయ్యలను బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని అరిటాకులో చుట్టి నిప్పుల మీద కాల్చాలి. బాగా కాలిన తర్వాత ఆకు నుంచి తీయాల్సి ఉంటుంది. వీలైతే మరో అరిటాకు తీసుకొని ఈ కూరను అందులో పెట్టి సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. చిట్టి ముత్యాల రొయ్యల పలావ్ కావాల్సినవి : రొయ్యలు : 200 గ్రా., బియ్యం : 250 గ్...