Skip to main content

Posts

Showing posts with the label shekar pabsetti

ఓం వినాయక విగ్రహాయనమః

'ఈ విగ్రహాలన్నీ ఎంతకిస్తావ్‌?' ఓ పెద్దావిడ అడిగింది. 'లేదండీ నేనివ్వను' చెప్పాడతను. 'మహా అంటే లక్షల విలువ చేస్తాయి. నేను కోటి రూపాయలిస్తాను' ఆశ పెట్టింది ఆమె. 'ఎన్ని కోట్లు?' అడిగాడాయన ఆసక్తిగా. 'పదికోట్లిస్తాను' గర్వంగా చెప్పిందామె. 'లేదండి. నేనివ్వను' ఆయన స్థిరంగా అన్నాడు. 'ఇరవై కోట్లిస్తాను' కాస్త పెంచింది. 'అయినా ఇవ్వను' ఆయన ఏమాత్రం దిగలేదు. 'ఇక బేరాలొద్దుగానీ, యాభై కోట్లిస్తాను. నాకిచ్చెయ్‌ ప్లీజ్‌' బతిమాలింది. 'ఎంతాస్తి ఉందేంటి మీకు?' అడిగాడాయన. 'ఓ ఐదువేల కోట్లు' చెప్పిందామె. 'ఆ ఆస్తంతా ఇచ్చినా ఈ విగ్రహాలు ఇవ్వను' కరాఖండిగా చెప్పాడు. లక్షల రూపాయల విలువచేసే విగ్రహాలను యాభై కోట్ల రూపాయలకు కూడా ఆయన ఎందుకివ్వలేదు? అంత విలువైనవా అవి? అవును. చుక్కలన్నీ ఏరి మీ ఇంట్లో దాస్తే.. ప్రపంచాన్ని బంధించి మీ గదిలో పెడితే.. మీరిచ్చేస్తారా? ఆయన కూడా అంతే. అవి కేవలం విగ్రహాలు కావు. ఆయన జీవితం. హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఆ ఇంటి తలుపుపై వినాయకుని విగ్రహం చెక్కి ఉంటుంది. అలాంటివి ...