Skip to main content

Posts

Showing posts with the label b. bhaskar rao

కథ... స్క్రీన్‌ప్లే.. దర్శకత్శం భాస్కర్ రావు.. ది లెజెండ్ ఫిల్మ్ మేకర్‌

లైట్స్ ఆన్... స్టార్ట్ కెమెరా.. యాక్షన్... 24 ఫ్రేములు.. 20 సినిమాలు.. 30 ఏళ్ల కెరీర్.. 73 ఏళ్ల అనుభవం.. 23 ఏళ్ల విశ్రాంతి.. మాటల తూటాలు.. మానవసంబంధాల కథాంశాలు.. దటీజ్ బి. భాస్కర్ రావు! ఆయన ఈ తరానికి తెలియక పోవచ్చు.. కానీ... ఆయన సినిమాలు నేటికీ పాఠాలు.. అలాంటి ఫిల్మ్ మేకర్‌తో ములాఖాత్ స్క్రిప్ట్ ఇది. ఆయన మాటల్లో క్లారిటీ ఉంటుంది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ సీన్లు ఉంటాయి. ‘ఉమెన్స్ కాలేజీ నుంచి కింగ్ కోఠీ వెళ్తుంటే.. సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు వెళ్లే దారి.. ఆ మూల మీద అప్పట్లో దిల్షాద్ థియేటర్ ఉండేది.. ఇప్పుడు రాయల్ అపార్ట్‌మెంట్ ఉంది. అక్కడి నుంచి ముందుకు వస్తే కుడివైపు వ్యాయామశాల.. అది దాటాక.. హనుమాన్ టెంపుల్ ఆర్చ్ వస్తుంది.. దానికి ఎదురుగా నిలబడు.. చిన్న గుడి కనిపిస్తుంది.. అక్కడే ఇల్లు’ భాస్కర్ రావు(బీఆర్) ఫోన్లో చెప్పిన తన ఇంటి చిరునామా ఇది. ఏ విషయమైనా అంత క్లియర్‌గా చెబుతారాయన. ఆ క్లారిటీ వెనక కాంటెంపరరీ అంశాలుంటాయి.. కాలగర్భంలో కలిసిపోయిన రీళ్లుంటాయి.. ఆ గల్లీలో భాస్కర్ రావు గురించి అడిగితే.. ‘కిరాయి ఉన్న ఇంటినే కొనేశాడు. సినిమా డైరెక్టరట. ఏం సినిమాల...