Skip to main content

Posts

Showing posts with the label ramanand

రామానంద్.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక కాస్టింగ్ డైరెక్టర్

1992,  రామ్‌గోపాల్ వర్మ ‘అంతం’ సినిమా ఆడియో విడుదలైన రోజు రాత్రి... చీకటిగదిలో ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు ఒంటరిగా కాళ్లు పట్టుకుని కూర్చున్నాడు. అతని పేరు రామానంద్.  ‘‘గుండెల్లో దడ దడ దడమంటూ ఉరుములతో... కళ్లల్లో భగ భగ భగ మండే మెరుపులతో.. ’’ టేప్ రికార్డర్‌లో క్యాసెట్ తిరుగుతోంది.  ఆ పాట అతని పరిస్థితికి దగ్గరగా ఉంది. అతని మనసునిండా ఉరుముల్లాంటి ఆలోచనలు.. కళ్లనిండా మెరుపుల్లాంటి కలలు.. అతని ఆలోచనల నిండా డాక్టర్ చెప్పిన మాటలే... ‘‘నువ్విక నడవలేవ్... నీ కాళ్లు చచ్చుబడి పోతాయ్. మూడేళ్లలో వీల్‌చెయిర్‌కు అతక్కుపోవాల్సిందే’’ కాని అతని కలలనిండా తన అందమైన భవిష్యత్తే... ‘‘నేను పెద్ద నటుణ్ణి కావాలి. వర్మ గారిని కలవాలి. ఆయనతో కలిసి పని చేయాలి. ఆయనలా సినిమాలు తీయాలి’’ ఈ ఉరుములు, మెరుపులతో అతని మనసు తుపానులా మారింది. కాసేపాగి టేప్‌రికార్డర్ కట్టేశాడు రామానంద్. అతని కళ్లు చీకట్లో ఏవో దృశ్యాల్ని వెతుకుతున్నాయి. అన్నీ ఫాస్ట్‌ఫార్వర్డ్‌లో వేగంగా కదులుతున్నాయి. ఒక దృశ్యం ఆగిపోయింది. చిన్నప్పుడు చూసిన ఆనంద్ సినిమా అది. క్యాన్సర్‌తో బాధపడుతున్న రాజేష్ ఖన్నాతో అమితాబ్ బచ్చన్ చెప్పే ...