Skip to main content

Posts

Showing posts with the label meetup

బడ్జెట్ టూర్...కలిసి వెళ్తే.. కలదు లాభం!!

  The world is a book and those who do not travel read only one page. - St. Augustine (ఈ ప్రపంచం ఒక పుస్తకం. ప్రయాణం చేయని వారు ఒక పేజీ మాత్రమే చదవగలరు) అందుకే.. వీలైనప్పుడల్లా ఏదో ఒక ప్రదేశాన్ని చూస్తుండాలి... కుదిరినప్పుడల్లా ఒక టూర్‌కి వెళ్తుండాలి... అందుకు ఈ వేసవి మంచి అవకాశం... డబ్బులు ఖర్చవుతాయని బాధపడేవారి కోసం ఒక ‘మీటప్’ ప్యాకేజీ ట్రెండ్ ఉంది... కలిసి వెళ్తే.. కలదు లాభం!! హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ ఫ్యామిలీ టూర్ వెళ్లాలనుకున్నారు. ఎంత ఖర్చవుతుంది? మీరు, మీ భార్యా పిల్లలతో కలిపి నలుగురైదుగురు అనుకుందాం. ఏసీ కారు అయితే ఎనిమిది గంటలకు పదిహేను వందల రూపాయలు.. వెళ్లి రావడానికి జర్నీ.. నాలుగు గంటలు.. అక్కడ ఉండేది నాలుగు గంటలు... సరిపోతుంది. కానీ ఒకవేళ లేటయితే కిలోమీటర్‌కి ఏడు రూపాయలు ఎక్స్‌ట్రా పే చేయాల్సిందే. లంచ్.. స్నాక్స్.. టికెట్లు.. బోటింగ్ ఖర్చు... మొత్తం కలిపి సింపుల్‌గా రెండు వేల రూపాయలు ఖర్చవుతుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో రెండు వేలంటే పెద్ద ఫిగరే. ఇదే బడ్జెట్‌లో నాలుగు ఫ్యామిలీలు అదే సాగర్‌కు వెళ్లొచ్చే బంపర్ ఆఫర్ ఉంది. జస్ట్ ఫర్ ఛేంజ్ ...