Skip to main content

Posts

Showing posts with the label enforcement againest drunk driving

ఆపరేషన్ డ్రంకెన్ డ్రైవింగ్ Stay Alive,Don’t Drink And Drive

తాగడం తప్పు కాదు.. కానీ తాగి వాహనం నడపడం తప్పే.. డ్రంకెన్ డ్రైవింగ్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ..పోలీసులూ సీరియస్‌గానే డీల్ చేస్తున్నారు.. తాగి నడిపితే బుక్ చేసి కోర్టుకు పంపిస్తున్నారు.. పేరెంట్స్‌ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు..ఆ తప్పు చేసిన వారి అనుభవాలను ఇక్కడ ‘మిక్స్’ చేస్తున్నాం...మీతో ‘మ్యాచ్’ చేసుకుని అర్థం చేసుకుంటే చాలు.  15 రోజుల క్రితం.. షిరిడీకి వెళ్తూ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని ప్రయాణికుల్లో ఒకరైన జ్యోతి చెప్పింది. ఈ సంఘటనలో జ్యోతి ఆరోపణని అనుమానించినా.. డ్రైవర్ ‘మత్తు’లో ఉండడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు చాలా సంఘటనలు ఆధారంగా ఉన్నాయి. అందుకే మద్యం సేవించి వాహనం నడపొద్దు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఆ హ్యాంగోవర్ పట్ల హైదరాబాద్ పోలీసులు యాంగర్‌గా ఉన్నారు. ఆరు నెలలుగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎగెనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (మద్యం సేవించినందుకు దావా)’ పేరుతో స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. రోజుకు సగటున 110 మందిని పట్టుకుని కోర్టుకు పంపిస్తున్నారు. అలా వెళ్లి ఫైన...