వందల సంవత్సరాల క్రితం... హైదరాబాద్‌లోని పంజాగుట్ట అడవి ప్రాంతం.. అనగనగా ఒకరోజు.. సర్‌పెర్సీ అనే వేటగాడు వేటకు వెళ్తాడు. దగ్గరలోని నదిలో ఏదో కొట్టుకు వస్తున్నట్లు పెర్సీ గమనిస్తాడు. అది తీరానికి సమీపించాక తెలుస్తుంది.. అదో పెద్ద రాక్షసబల్లి అని. దాని నుంచి తప్పించుకునేందుకు పరుగు మొదపూడతాడు పెర్సీ. ఆ డైనోసార్ వెంట పడుతుంది. పరుగు తీస్తున్న పెర్సీకి ఒక ఆటో ఎదురౌతుంది. ‘త్వరగా పోనీయ్.. నన్ను ఇరవై ఒకటో శతాబ్దానికి తీసుకెళ్లూ..’ అంటూ పరుగున ఆటో ఎక్కాడు పెర్సీ. ‘ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా?’ అని బేరం మొదపూట్టాడు ఆ ఆటోవాలా. పెర్సీకి ఆటోవాడి మీద కోపం కంటే డైనోసార్ మీద భయమే ఎక్కువ. అందుకే ఆటోవాడ్ని ‘జల్దీ.. జల్దీ..’ అని బలిమిలాడాడు. ఆటో కదిలింది.. ఇరవై ఒకటో శతాబ్దానికి. అదొక ‘టైమ్ మిషిన్’ ఆటో. దాని చక్రాల కదలికలో కాలగమం.. హైదరాబాద్ పరిణామ క్రమం.. కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇది విఠాలాచార్య సినిమాకాదు. స్పిల్‌బర్గ్ జూరాసిక్ పార్క్‌కు హైదరాబాద్ వెర్షన్ అంతకన్నా కాదు. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంగా వస్తున్న తొలి గ్రాఫిక్ నవలలోని మొదటి ఎపిసోడ్. ‘యుగంతర్’ సంస్...