Skip to main content

Posts

Showing posts with the label retire at 40

రిటైర్ ఎర్లీ as soon as possible

మనదేశంలో 2010-11 మధ్య 8,800 మంది టీచర్లు ఎర్లీ రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు అధికారిక లెక్కలున్నాయి. గడిచిన 13 ఏళ్లలో ఇదే పెద్ద సంఖ్య అన్నది వాస్తవం. అధిక పనిభారమే దీనికి కారణమని నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ చెబుతోంది. పోయిన సంవత్సరం వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జిందగీ నా మిలేగి దొబారా’ సినిమా చూశారా? అందులో ఒక హీరో సరిపడా డబ్బు సంపాదించి 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. జీవితమనే పరుగుపందెంలోంచి త్వరగా బయటపడాలని తపించే చాలామందికి అతను ఒక ప్రతినిధిలా కనిపిస్తాడు. చాలా సంవత్సరాలు బండ చాకిరి చేయడం నుంచి బయటపడేందుకు రిటైర్‌మెంట్ ఒక రివార్డ్ లాంటిది. అందుకే ఆర్-వర్డ్ ఇప్పుడు హాట్ వర్డ్ అయింది. ఇక్కడ ఆర్ అంటే మరో అర్థం కూడా ఉంది. రాహుల్ ద్రవిడ్. యస్.. ఆయన ఈ మధ్యే తన 39వ ఏట క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆయనే కాదు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే యంగ్‌జనరేషన్, యుఎస్ రిటర్న్స్ త్వరగా ‘పరుగు’ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఆ ఎక్సైట్‌మెంట్ గురించే ఈ కథనం. జయవూపకాష్ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బెంగళూరు, పుణె అమెరికాల్లో పనిచేశాడు. ఆ సాఫ్ట్‌వేర్ లైఫ్ అతనికిప్పుడు బ...