Skip to main content

Posts

Showing posts with the label lifestyle building suicide

ఎవరినైనా ప్రేమిస్తే.. మనసుతో ప్రేమించండి. టైంపాస్ కోసం ప్రేమించకండి..

ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. వినోద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతనితో కొంతకాలం తిరిగాక.. సంతోష్ అనే మరో అబ్బాయికి దగ్గరయ్యింది. తనకు దూరంగా ఉండడం వినోద్‌కి నచ్చలేదు. దీంతో 2010.. ఏప్రిల్ 18.. ఆదివారం.. బేగంపేటలోని లైఫ్‌స్టయిల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు మీది నుంచి తోసేసి.. తానూ దూకాడు వినోద్. ఆ రోజు వినోద్ ప్యాంట్ జేబులో ఒక సూసైడ్‌నోట్ దొరికింది. మై లాస్ట్ డే సూసైడ్ లెటర్ అని మొదలుపెట్టాడు వినోద్. మూడేళ్లుగా నేనూ శ్రీదేవి పేమించుకుంటున్నాం... అయితే కొన్ని నెలలుగా ఆమె నాతో సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయమై అడిగితే సంతోష్ అనే యువకుని పేమిస్తున్నానని చెప్పింది. అది నాకు నచ్చలేదు. తనే జీవితంగా బతుకుతున్న నన్ను కాదని వేరొకర్ని ప్రేమించడం నేను భరించలేకపోయాను. తను నన్ను మోసం చేసింది. నాలా మరో యువకుని జీవితం నాశనం కాకూడదు. అందుకే తనను చంపాలనుకుంటున్నాను. తను లేనిది నేను బతకలేను. అందుకే నేనూ చనిపోతున్నాను... అని రాశాడు. ఎవరినైనా ప్రేమిస్తే.. మనసుతో ప్రేమించండి. టైంపాస్ కోసం ప్రేమించకండి.. అని కూడా రాశాడు. అమ్మానాన్నలకు సారీ చెప్పాడు. ఇప్పటివరకు మీకోసం ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి.. అని రాశాడు.