Skip to main content

Posts

Showing posts with the label atadu aamelo sagam

మోడర్న్ హభ్బీ : అతడు ఆమెలో సగం

కార్యేషు దాసి కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ... అని భార్య ఎలా ఉండాలే చెప్పారు కానీ.. భర్త ఎలా ఉండాలో ఎవరూ చెప్పలేదు. బహుశా పురాణాలు మగవాళ్లు రాయడం వల్ల వాళ్లకీ ప్రశ్నలు తలెత్తకపోవచ్చు. మగువ ఇలా ఉండాలి.. అని చెప్పడంలోనే.. మగాడూ దానికి ప్రతిగా.. పాజిటివ్‌గా ఉండాలనే అర్థమూ ఉంది. అంటే ఎలా ఉండాలి? ఈ మోడర్న్ హజ్బెండ్స్ ‘మిక్స్ అండ్ మ్యాచ్’ నుంచి తెలుసుకోండి.   ప్రపంచంలో సక్సెస్ అయిన చాలా కంపెనీల సీఈవోలు ఆడవాళ్లే అనేది ఒక సర్వే. పతనమవుతున్న కంపెనీలలో ఆడవాళ్లు లీడ్ చేస్తున్న వాటి కంటే మగవాళ్లు లీడ్ చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయనేది ఇంకో అధ్యయనం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. కానీ ప్రతి స్త్రీ విజయం వెనుక అన్ని సార్లూ పురుషుడు ఉండకపోవచ్చు. మహిళ సంపాదన పరురాలైతే ఈ సమాజం గౌరవిస్తుంది. ఆ కుటుంబ కొనుగోలు శక్తి, ఆర్థిక సామాజిక స్థితి పెరుగుతుంది. మహిళ ఇప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం కావడం లేదు. రైళ్లు, విమానాలు నడుపుతోంది. అంతరిక్షంలో అడుగుపెట్టింది. ఆమె అలా ఎదగాలంటే ఆ కుటుంబం సహకరించాలి. ఆమె భర్త ప్రోత్సహించాలి. ఆమె ఆకాశంలో సగం.. ఆమెల...