Skip to main content

Posts

Showing posts with the label manjistha

మెంటల్ రిటార్డేషన్ కోసం మెడిటేషన్‌కి... హెల్త్ ఇన్‌ఫ్యాచుయేషన్ కోసం యోగాకి వెళ్లే పెద్దల కోసం

పాలు ఏ చెట్టు నుంచి వస్తాయి? సబ్బులు ఏ ట్రీకి కాస్తాయి? - అని అడిగే పిల్లల కోసం ఈ స్టోరీ. మెంటల్ రిటార్డేషన్ కోసం మెడిటేషన్‌కి... హెల్త్ ఇన్‌ఫ్యాచుయేషన్ కోసం యోగాకి వెళ్లే పెద్దల కోసం కూడా.  మంజిష్ట అనేది సంస్కృత నామం. ఒక విలువైన ఔషధ మూలిక పేరు. రుబియా కార్డిఫోలియా దీని శాస్త్రీయ నామం. ఆయుర్వేదంలో చెట్టంత చరిత్ర ఉంది ఈ మూలికకి. ఆయుర్వేద వైద్యానికి మూల పురుషుడు చరకుడు తన చరక సంహితలో దీని గురించి వర్ణ, జ్వరాహర, విషజ్ఞ అని రాశాడు. మేని ఛాయని పెంచడం, జ్వరాన్ని తగ్గించడం, విషపదార్థాల నుంచి రక్షించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. రక్తాన్ని శుద్ధి చేయడం దీని ప్రత్యేకత. ఇదంతా మంజిష్ట మూలిక గురించి.. కానీ మనం చెప్పుకునేది ‘మంజిష్ట’ అనే హెర్బల్ గార్డెన్ గురించి. ఆ తోటలో అన్నీ మంజిష్ట చెట్లే ఉంటాయనుకుంటున్నారా? కానే కాదు.. అలాంటివి ఇంక చాలా ఉన్నాయి. ఎక్కడుంది? హైదరాబాద్ మియాపూర్‌కి దగ్గరలో మై హోమ్ జువెల్ అనే పే..ద్ద అపార్ట్‌మెంట్ ఉంది. 24 ఎకరాల స్థలంలో 9 ఎకరాల నిర్మాణం. 14 బ్లాకులు.. 14 ఫ్లోర్లు.. మొత్తం 2016 త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్స్. సుమారు ఎనిమిది వేల మంది అక్కడ నివసి...