పద్మవ్యూహాన్ని ఛేదించినవాడు... విజేత కాదు.. అతడు కేవలం బతికి బయటపడ్డవాడు మాత్రమే! ఆ వ్యూహంలో చిక్కుకున్న వారిని కాపాడాలనుకునేవాడే నిజమైన విజేత... అదే సర్వైవర్‌కి.. కాంకరర్‌కి ఉన్న తేడా... ఆ పోరాటంలో.. ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది... అలాంటి ‘చీకటి’ నుంచి వెలుగులోకి వచ్చిన ఒక అభిమన్యుడు.. గణేష్ నల్లారి. అమీర్ ‘సత్యమేవ జయతే’తో ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టించిన ఆయనతో ములాఖాత్. --- ఒక సినిమా కథ... అభిమన్యు.. ఒక సక్సెస్‌ఫుల్ సినిమా డైరెక్టర్. బాల్యంలో అతడు సెక్సువల్ అబ్యూస్ (లైంగిక వేధింపు)కు గురవుతాడు. ఆ చీకటి జ్ఞాపకాలు అతణ్ణి నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. మనసులో సునామీ.. ఎవరికీ అర్థంకాని మానసిక సంఘర్షణ.. అలాగే బాధపడుతూ కూర్చుంటే.. అతని జీవితం అక్కడే ఆగిపోయేది. అతడు కాలంతోపాటు కలిసి నడిచాడు. జీవితంలో గెలిచాడు. కానీ.. సినిమా కథలో అతని ‘లైంగిక గుర్తింపు’.. ఒక ప్రశ్నార్థకం??? (ఏవూపిల్, 2011లో విడుదలైన బాలీవుడ్ మూవీ ‘ఐ యామ్’లో ఒక భాగమిది. ఒనీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డుని అందుకుంది) ఒక యథార్థ కథ... బాల్యంలో నా మీద బలాత్కారం జరిగింది. కానీ ...