Skip to main content

Posts

ఆ 'ఛాయ' ఇప్పుడు డాక్యుమెంటరిగా

నిన్నటి వరకు మీరు ఈ బ్లాగ్లో చూసిన ఛాయ సోమేశ్వర టెంపుల్ మిస్టరీ గురించి మేము ఒక డాక్యుమెంటరి చేస్తున్నాము. దానికి సంపాదించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇవి. ట్రైలర్ రేపు ఇదే బ్లాగ్లో.

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

అతని కళ్ళు ఆమె.. ఆమె కాళ్ళు అతను

మా ఫ్రెండ్స్‌ కొందరు యంగ్‌ ఇండియా యూత్‌ అసోసియేషన్‌గా ఏర్పడి కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్‌ రామాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కి నూనూ వెళ్లాను. అక్కడ ఏర్పాటు చేసిన ఒక కౌంటర్‌ నన్ను ఎందుకో ఆకట్టుకుంది. నలుగురు అంధ విద్యార్థులు అగరుబత్తీలు అమ్ముతున్నారు. వాళ్లని ఆరా తీస్తే అవి వాళ్లు చేసినవే అని తెలిసి ఆశ్చర్యపోయాను. వాళ్ల వెనకాల వికలాంగుల కళ్యాణవేదిక అని ఒక బ్యానర్‌ కట్టి ఉంది. దాన్ని నిర్వహించేదెవరన్నది తెలుసుకోవాలనిపించింది. అక్కడ మొదలైంది ఈ కథ. వికలాంగుల కళ్యాణ వేదిక నిర్వహించేంది సుభాష్‌ గుప్తా. ఆయన కూడా అంధుడే. సమయానికి అక్కడే ఉన్నారు. నేను తర్వాత మాట్లాడతానని ఫోన్‌ నెంబర్‌ తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను. ఒక వారం రోజుల తర్వాత ఫోన్‌ చేశాను. నా వాయిస్‌ వినగానే ఆయన గుర్తుపట్టారు. కళ్యాణ వేదిక కింద పెళ్లి చేసుకున్న జంటలందరినీ కలవాలనుందని చెప్పాను. ఎందుకని అంటే చెప్పడానికి నా దగ్గర మాత్రం అప్పుడు సమాధానం లేదు. "వాళ్లందరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఎవరి జీవితం వారు అనుభవిస్తున్నారు. అందరినీ కలవడం సాధ్యం కాదు గానీ కొందరిని కలిపించే ప్రయత్నం చేస్తానని'' చెప్పా...

మల్లి

సెల్‌ఫోన్‌ రింగయ్యింది. లిఫ్ట్‌ చేసి "హలో'' అన్నాను. "హలో... ఇందాక ఎవరు మిస్స్‌డ్‌ కాల్‌ ఇచ్చింది'' అంటూ ఓ లేడీ వాయిస్‌. "మిస్డ్‌కాలా? నేనివ్వలేదండి!'' సమాధానమిచ్చా. "ఇంకోసారి చేస్తే చంపేస్తా '' అంటూ కోపంగా ఫోన్‌ పెట్టేసింది ఆమె. * * * తల తీసేసినట్టయ్యింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. "ఎవరా అమ్మాయి? ఎందుకలా అంది? మిస్డ్‌కాల్‌ ఎవరిచ్చారు?'' ఆ గుర్తొచ్చింది! శీను!! ఇందాక ఫోన్‌ చేసుకుంటానంటే సెల్‌ ఇచ్చా. వెంటనే శీనుకు ఫోన్‌ చేసి విషయం అడిగా. "ఔన్రా నేనే చేశా. లిఫ్ట్‌ చేయలేదు. ఏం కాదు లైట్‌ తీస్కో'' నిర్లక్ష్యంగానే సమాధానమిచ్చాడు శీను. "ఇంతకు ఎవర్రా అమ్మాయి?'' "అదేరా మీ క్లాస్‌మెట్‌ మల్లి'' "ఓ... యా... మల్లి.. మల్లిక. తనకు పెళ్లయిపోయింది కదా, నువ్వెందుకు ఫోన్‌ చేశావ్‌'' "ఔను.. పెళ్లీ అయిపోయింది... మొగుడూ వదిలేశాడు. అందుకే... ట్రయల్‌ ''అంటూ అదోలా నవ్వాడు వాడు. * * * మల్లికి పెళ్లయిపోయింది. భర్త నుంచి వేరుగా ఉంటోందా?! ఒక్కసారి కలవాలి. ఎందుకో తెలియదు. బస్‌ ఎక్కాన...

మాకు పట్టెడన్నం కాదు.. గుప్పెడు ప్రేమ కావాలి

'అతడు' సినిమా చూసినప్పటి నుంచి నన్నో మాట వెంటాడుతూనే ఉంది. ఆ సినిమా చివర్లో నాజర్‌ మహేష్‌ బాబుతో ఇలా అంటాడు- 'నాకు ఈ వయసులో కావాల్సినవి జ్ఞాపకాలు. అవి నీ వల్ల చాలానే ఉన్నాయి' అని. అలాంటి జ్ఞాపకాలు నాకూ కావాలి. వాటి కోసం చాలా రోజులు వెతికాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అలా జ్ఞాపకాలు మూటగట్టుకున్నవారి కోసం కూడా గాలించాను. చివరికి దొరికారు. ఒక రోజంతా వారితో గడిపిన అనుభూతి నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఆ అనుభవాలనే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వెళ్లే దారిలో ఇబ్రహీంపట్నం అది. అక్కడి నుంచి నాయినంపల్లి వెళ్లే మార్గంలో వినోభానగర్‌ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది మాతాపితరుల సేవాసదనం. అనాథలుగా మిగిలిన వృద్ధుల పాలిటి అమ్మఒడి అది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం12.30 గంటలు గణగణా గంట మోగింది. భోజన సమయం అయిందనడానికి అది సంకేతం. ఓ గదిలో మంచంపై లేవలేని స్థితిలో మూలుగుతూ పడుకొని ఉంది ఓ వృద్ధురాలు. ప్లేటులో భోజనం పెట్టుకుని వచ్చి ఆమెని లేపింది ఓ పెద్దావిడ. ఆమె భుజాలు పట్టుక...

ఎంఎన్‌జెలో ఒక రాత్రి (పార్ట్-1)

ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ ... రాత్రి పదిగంటలు... మెయిన్‌ గేటుకు ఎడమవైపు మూలన చిన్న గుడి ఉంది. అమ్మ వారి ముందు దీపం వెలుగుతోంది. దీపం పక్కనే నాలుగు అగరుబత్తీలు కాలుతున్నాయి. వాటినెవరో అరటిపండుపై గుచ్చారు. పసుపూ, కుంకుమా చల్లారు. గుడి పక్కన ఓ పది పదిహేను బైకులు పార్క్‌ చేసి ఉన్నాయి. "నాలుగైదుసార్లు బయటికి వెళ్తుంటాం. వస్తుంటాం. వెళ్లొచ్చిన ప్రతిసారీ ఐదు రూపాయలివ్వాలా?'' అంటూ పార్కింగ్‌ టోకెన్‌ అడిగిన కుర్రాడితో గొడవ పడుతున్నాడో పెద్దాయన. పార్కింగ్‌ వెనకాల వరండా. ఆ వరండాలో ముగ్గురు పడుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు. పడుకున్న వారిలో ఇద్దరికి దుప్పట్లు కూడా లేవు. నేల మీదే పడుకున్నారు. ఒకావిడ స్తంభానికి ఆనుకుని కూర్చుంది. ఆమె ఒళ్లో ఓ చిన్నారి పడుకుంది. కాళ్లు ముడుచుకుని పడుకున్న ఆ పాపని జో కొడుతోంది ఆ తల్లి. చంటిది హాయిగా నిద్రపోతోంది. ఆ అమ్మ మాత్రం శూన్యంలోకి దీనంగా చూస్తోంది. కుడివైపు ప్రహరి వెంబడి ఆంబులెన్స్‌ ఆగిఉంది. ఆంబులెన్స్‌కు, గోడకి మధ్య సందులో ఒకాయన బీడీ కాలుస్తున్నాడు. ఆంబులెన్స్‌ దాటాకా గోడ పక్కన ఇద్దరు కూర్చున్నారు. అందులో మాసిన గడ్డం ఉన్న వ్యక్తి అన్నం పొట్లాం ...