Skip to main content

Posts

అనన్య పర్వం - ఒక నజియా కోసం.. నవల ముందుమాట

*Shall we meet today for lunch*  ఒక మెసేజ్ ఎప్పుడో వచ్చి సెల్ ఫోన్ Inboxలో కూర్చుంది.  ఎవరు పంపిండ్రో. ఊరు లేదు. పేరు లేదు. ఆలోచిస్తూ ‘but who r u ?’ రిప్లయి ఇచ్చా ‘ananya’ రిప్లె వచ్చింది.  అనన్య? ఎవరీ అనన్య?? ఆరు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు గుర్తు చేసుకోవడానికి. టక్కున తట్టింది.  యస్.. అనన్య. షార్ట్ ఫిల్మ్ మేకర్. ముంబై. మంచి సందేశంతో షార్ట్ ఫిల్మ్ తీసింది. నిర్భయ గురించి. రెండు వారాల క్రితం.. యూట్యూబ్లో చూశాను. ‘జిందగీ’కి స్టోరీ చేయాలనిపించింది. ఫేస్బుక్లో వెతికి పట్టుకుని, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. కానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాతి రోజు మెసేజ్ పెట్టాను. ఇంటర్వూ కావాలని.. ఇన్ బాక్స్ లో  తెలియని అమ్మాయిలు వెంటనే రిప్లె ఇవ్వరు. అనుకున్నాను.. కానీ అనన్య ఇచ్చింది.  ‘థ్యాంక్యూ బాస్! మీ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. అదేంటి నేను వెతుకుతున్న వ్యక్తి నాకే మెసేజ్ పెట్టారని. ఇట్స్ ఏ మిరాకిల్!’ అంది మెసేజ్లో.  ‘వాట్ నన్ను వెతుకుతున్నారా? ఆశ్చర్యంగా ఉందే! ఎందుకు?’ టెక్ట్స్ చేశా. ‘చెప్తా. బట్ ఇప్పుడు కాదు (స్మైలీ)’  ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట...

తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి సారిగా ఒక పుస్తకానికి ప్రమోషనల్ వీడియో..

నజియా కోసం.. ఒక పేజీ.. (1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమ కథ)

అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.. అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన.. ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా.. ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం.. నజియా పుస్తకానికి సంబంధించిన అప్ డేట్స్ అందించేందుకు ఫేస్ బుక్ లో ఒక ప్రత్యేక పేజీ క్రియేట్ చేశాం. ఒక నజియా కోసం : Oka Nazia Kosam ఈ కథ మీద మీకు ఆసక్తి ఉంటే ఎప్పటి కప్పుడు అపడేట్స్ తెలుసుకునేందుకు పై లింక్ క్లిక్ చేసి లైక్ నొక్కండి.. పోస్టు వివరాలు మీకు కనిపిస్తాయి.. 

మూడు కర్రలు : ఉగాదికి ఊరెళ్లినప్పుడు ఈ విషయాలు తెలిశాయి

చిర్క బద్ద : గౌడు కల్లు గీసేందుకు వాడే కత్తిని గీస కత్తి అంటరు. దీన్ని నూరడం భలే ఉంటుంది. ఒక పెద్ద రాయి పక్కన ఒక కర్ర ను పెట్టి చిన్న రాయితో కొడతాడు. రాయి నుంచి కర్ర మీద పడే పొడితే కత్తి నూరుతాడు. ఈ కర్రనే చిర్క బద్ద అంటారు. చిడుత బద్ద, చిరిక కర్ర అనే పేర్లు కూడా ఉన్నాయట. దీన్ని చాలాసార్లే చూశాను. కానీ ఈ చిర్క బద్దను కుంకుడు కర్రతో మాత్రమే తయారు చేస్తారట.  రోకలి : రోకలి తయారీకి ముఖ్యంగా ఎర్రచందనం కర్రను ఉపయోగిస్తారు. ఎనుమొద్దు, ఏపి క ర్రను కూడా ఉపయోగిస్తారు. ఇవి దొరకని పక్షంలో ఊటి, చింత కర్రలను వాడతారు. ఊటి, చింత కర్రలను వాడితే తొందరగా చీలికలు వస్తాయట. అందుకే వీటిని తక్కువగా వాడతారు. మామిడి కర్రతోనా రోకలి చెయ్యటం? అనే సామెత కూడా ఉంది. అయితే మా ఊర్లో మాత్రం రోకలి రేగు కర్రని మాత్రమే వాడతారు. మటన్ కొట్టే చక్క దిమ్మె (దీని ప్రత్యేక పేరు ఏదైనా ఉందా? : పండుగలప్పుడు యాటలు  కోసినప్పుడు మా ఊర్లో ఇది కనిపిస్తుంది. మామూలుగా అన్ని మటన్ షాపులలో కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం చింత చెట్టు మొద్దును మాత్రమే వాడతారట.  వాడతారట.  మటన్ కొట్టే చక్క ...

ఒక నజియా కోసం.. : 1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమకథ (నవల)

అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.. అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన.. ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా.. ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం.. నా హీరోయిన్.. ఐదేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి కోసం రాసిన కథనం ఇది. (25.2.2010) ఇదిగో ఈ ఫోటోలో ఎరుపు రంగు చీరలో వెలిగిపోతుంది చూశారా? తనే నా హీరోయిన్.  ఇబ్రహీంపట్నం నుంచి నాయినంపల్లి వెళ్లే మార్గంలో వినోభానగర్ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది "మాతాపితరుల సేవాసదనం.' అనాథలుగా మిగిలిన...

హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే ఉన్నాయి..

హైదరాబాద్ నూర్జహాన్ ఈ చరిత్ర పునాదులు తవ్వుకుంటూ పోతే... పునాదుల కింద సమాధులు.. సమాధుల కింద ఎన్నో సత్యాలు. ముచ్‌కుందా నది అలాంటి ఓ సత్యాన్నే చెబుతోంది. ఒక నది రెండు తీరాలను విడదీయదు. రెండు ఒడ్డులను కలుపుతుంది. అలాంటి కలయికకు ప్రత్యక్షసాక్షి ముచ్‌కుందా. వరదకు ఎదురీదిన ఖులీ, భాగమతిల ప్రేమ నగరం.. ఈ భాగ్యనగరం.ఆ దంపతుల గారాల కూతురుదే ఈ సమాధి. కుతుబ్ షాహీ సమాధులలో హయాత్ బక్షీ బేగం సమాధి ప్రత్యేకమైనది. ఆమె ఎన్నడూ స్వయంగా పాలించలేదు. కానీ కుతుబ్ షాహీలలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉన్నది. హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే మన కళ్లకు కనిపిస్తున్నాయి. గగనంలో చుక్కలు.. తోటలోని పూవులు.. కలహించక కలిసుండును.. మనుషులేల కలహించుట.. అన్న దాశరథి మాటలు గుర్తుకువస్తున్నాయి ఈ సమాధిని చూస్తే. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ హైదరాబాద్ నూర్జహాన్ కథ వినాల్సిందే.  సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా చనిపోంగనే ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్‌షా పన్నెండు సంవత్సరాల వయస్సులనే సింహాసనం అధిష్టించినాడు. ఇతను కుతుబ్‌షాహీ వంశ పరిపాలకులల్ల ఐదో రాజు. చిన్న వయస్సు వల్ల అతను కేవలం నామ్ కే వస్తే నవాబుగా ఉన్నడు. తల్లి ...

ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యాన్ని పాలించిన ఓ వీర వనిత గాథ

స్వాతంత్య్రానికి పూర్వం దేశాన్ని తెల్లదొరలు, రాష్ర్టాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం కష్టాలు పడుతుంటే.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జల్.. జంగల్.. జమీన్.. అంటూ గర్జించాడు మన గోండు వీరుడు కొమురం భీమ్.  అది ఒక స్వేచ్ఛా పోరాటం. ఈ సువిశాల భారతదేశంలో ఆదివాసులది మొదటి నుంచీ ఇలాంటి పోరాటమే. ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యాన్ని పాలించిన ఓ వీర వనిత గురించి ఎప్పుడైనా విన్నారా? మొఘలుల సామ్రాజ్యం ఉత్తర భారతం మొత్తం విస్తరించినా, దక్షిణ భారతంలో విస్తరించకుండా పోరాడిన యోధులు గోండులు. ఆదిలాబాద్ అడవులు మొదలుకుని..  దక్షిణ భారతదేశం సరిహద్దు భూభాగంలో మధ్య భారతపు అతి పెద్ద వన సామ్రాజ్యం గోండ్వానా. 450 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ గోండ్వానాను ఆక్రమించడానికి యత్నిస్తే  ఎదురొడ్డి పోరాడింది రాణీ దుర్గావతి. శత్రువు చేతికి చిక్కి బానిసగా బతికేకంటే.. విజయావకాశాలు లేనప్పుడు ఆత్మత్యాగం చేసుకుని గోండ్వానా శౌర్యాన్ని, ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన ధీర వనిత మహారాణి దుర్గావతి ఈ వారం మన ...