Skip to main content

ప్రపంచంలో కొన్ని గొప్ప అబద్ధాలు


1. చెక్కు మెయిల్‌ చేశాను. 

2. నేను గవర్నమెంట్‌ సర్వెంట్‌ని, మీకు సహాయం చేయడానికి వచ్చాను.

3. హే! నేను ఆ డబ్బులు నీకు ఇచ్చేశాననుకుంటా.

4. మీకు ప్రామిస్‌ చేస్తున్నాను. వచ్చే శుక్రవారం తప్పకుండా ఇస్తాను. 

5. ఇంత ఘనం ఎప్పుడూ తాగలేదు. 

6. హా.. బాగానే ఉన్నా. 

7. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

8. మీరు సన్నగానే ఉన్నారు. మీ బట్టల వల్లే లావుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

9. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. 

10. పది మందిలో తొమ్మిది మంది అదే చెప్పారన్న సర్వే...

11. దయచేసి లైన్‌లో ఉండండి. మా కస్టమర్‌ కేర్‌ రిప్రజెంటేటివ్‌ మీతో మాట్లాడతారు. 

12. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి.

13. మీరు కావాల్సినంత బరువు కోల్పోతారు. 

14. నేను డైవర్స్‌ తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. 

15. లేదు లేదు నీను కాసేపట్లో కాల్‌ చేస్తాను. 

16. నిజంగా నాకు తెలియదు ఎవరలా చేశారో. 

17. నాకు తెలుసు అది నా పని కాదని. 

18. అది నా వ్యసనం కాదు. నేను ఎప్పుడంటే అప్పుడు సిగరెట్‌ మానెయ్యగలను. 

19. నిజం నన్ను నమ్ము. 

20. ప్రత్యేకంగా మీ కోసమే  చేశా. 

Comments

అన్ని ఎమో కాని కొన్ని మాత్రమ్ నాకు తెలుసు. ఈసారి ఎవరైనా ఇవి చెప్తే అబద్దమని అనుకోవాలన్న మాట. సరే.
మీ టపా బాగుంది..! (నిజమా? అబద్దమా??)
నిజం గురు...
ఇందు లో నేను నా జీవితం లో చెప్పిన అబద్దాలు కూడా వున్నై.
అవి
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నేను డైవర్స్‌ తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను.
లేదు లేదు నీను కాసేపట్లో కాల్‌ చేస్తాను.
అది నా వ్యసనం కాదు. నేను ఎప్పుడంటే అప్పుడు సిగరెట్‌ మానెయ్యగలను.
నిజం నన్ను నమ్ము.
Anonymous said…
కొన్ని గొప్ప అబద్దాలకి కొన్ని నిజాలు
1. అది రాలేదని మళ్ళీ చెప్పేలోగా డబ్బు రెడీ చెయ్యాలి
2. కాబట్టి నాకెంతిస్తావ్?
3. ఇచ్చేశావని అనవా ప్లీజ్
4. వచ్చే శుక్రవారం నేనెక్కడుంటానో చెప్పుకో చూద్దాం..?
5. ద్రవంగా ఇంతకంటే ఎక్కువే తాగాను
6. కాకపోతే అమ్మకి షుగరు, నాన్నకి అల్సరు, చెల్లెలికి పెళ్ళిసంబంధం కుదరట్లేదు, తమ్ముడు జైల్లో పడ్డాడు, నా వుద్యోగం వూడింది.. నేను బాగానే వున్నా..!
7. నిజం నేను ప్రేమించే వనజ, జలజల మీద వొట్టు
8. జుట్టు పెరిగితే చెప్పు ఇంకా ఏ ఏ కారణాలవల్ల లావుగా వున్నావో చెప్తాను
9. నువ్వేం మాట్లాడుతున్నావో అది అర్థం చేసుకోవటం నాకిష్టం లేదు
10. అలా చెప్పేవాళ్ళనే ఎన్నుకున్నామే.. తప్పు చెప్పిన ఆ వొక్కడు ఎవడ్రా?
11. జీతాలివ్వలేక సగం మంది రిప్రజెంటేటివ్‌లను తీసేసాము. మిగిలిన వారిలో సగం నైట్ డ్యూటీకి వస్తారు. వచ్చిన సగంలో సగం పని చెయ్యరు.
12. సరే అని ఇక్కడే నాతో మాట్లాడుతూ వుండు.. నీకు గడ్డం పెరిగే లోపు వదిలేస్తా వట్టు.
13. పర్సు బరువు
14. ఆ తరువాత నీతో డైవర్సు ప్లాను చెయ్యాలి..
15. చేస్తాను నిజంగా చేస్తాను.. ఒక అయిదారేడు కోట్ల నిముషాల తరువాత
16. తెలిస్తే చెప్పాలా? అవును మా బుడ్డోడే చేసాడు అయితే?
17. దొరికిపోతానో ఏంటో?
18. రాత్రి పడుకున్న దగ్గరనించి తెల్లవారేదాకా రోజూ మానేస్తున్నా తెలుసా?
19. నువ్వు నమ్మితేనే కదా నేను చెప్పింది నిజమయ్యేది..!!
20. దాని దుంపతెగ కుక్క కి పెట్టినా తినట్లేదు మరి..!!

aripirala
మీ టపా బాగుంది :)...aripirala :) :)
Ravikanth said…
Nijamga ivanni nijame (Abaddale).

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...